మెగా ట్రీట్.. ‘వారణాసి’లో రాముడిగా మహేష్.. హనుమంతుడిగా ఎవరంటే
ABN, Publish Date - Aug 09 , 2026 | 08:15 PM
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ చుట్టూ రోజూ ఏదో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతూనే ఉంది.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli), సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (Varanasi) చుట్టూ రోజూ ఏదో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. మహేష్ బాబు 29వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ భారీ అడ్వెంచరస్ డ్రామాకు సంబంధించి తాజాగా ఫిలింనగర్ వర్గాల్లో ఒక మైండ్ బ్లాకింగ్ రూమర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ సినిమాలో ఇండియన్ సినీ హిస్టరీలోనే నెవర్ బిఫోర్ అనేలాంటి ఒక పవర్‌ఫుల్ మల్టీస్టారర్ సర్‌ప్రైజ్ ఉండబోతోందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అదేంటంటే..
ఈ చిత్రంలో కథాంశం ప్రకారం ఉండే త్రేతాయుగం ఎపిసోడ్‌లో సూపర్‌స్టార్ మహేష్ బాబు శ్రీరాముడి పాత్రలో సరికొత్త అవతారంలో కనిపించనున్నారనే టాక్ గతంలోనే వచ్చింది. దీనిపై దర్శకుడు రాజమౌళి కూడా స్పష్టత ఇచ్చారు. అయితే ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఏంటంటే.. ఆ రాముడికి అత్యంత ప్రియమైన, దైవత్వంతో కూడిన పవర్‌ఫుల్ ‘హనుమంతుడి’ (Lord Hanuman) పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) నటించబోతున్నారని ఫిలింనగర్ టాక్. మొదట ఈ విశిష్టమైన పాత్ర కోసం బహుభాషా నటుడు ఆర్. మాధవన్ పేరును పరిశీలించినప్పటికీ, రాజమౌళి తన విజన్‌కు అనుగుణంగా రామ్ చరణ్ ఐకానిక్ స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్స్ డివైన్ లుక్ సరిగ్గా సెట్ అవుతాయని భావించినట్లు తెలుస్తోంది.
ఇటీవలే విడుదలైన ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ క్లైమాక్స్ ఎపిసోడ్‌లో హనుమంతుడి ప్రతీకగా ప్రదర్శించిన రౌద్రం, రౌద్ర రసంతో కూడిన నటన ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో మైమరిపించింది. ఆ సినిమాలో చరణ్ చూపించిన డివైన్ అండ్ పవర్‌ఫుల్ అప్పీరెన్స్ రాజమౌళికి కూడా బాగా నచ్చిందని, అందుకే ఈ ప్రాజెక్ట్‌లోని ఆ కీలక ఎపిసోడ్ కోసం చరణ్ సరిగ్గా సరిపోతారని ఆయన భావించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ (RRR) విజయం తర్వాత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళి-చరణ్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఒకవేళ ఈ వార్త గనుక నిజమైతే, ఒకే తెరపై శ్రీరాముడిగా మహేష్ బాబును, హనుమంతుడిగా రామ్ చరణ్‌ను చూడటం అభిమానులకు కంటికి పండగే అని చెప్పాలి. భారతీయ చిత్రసీమలోనే ఇది అత్యంత భారీ కాంబినేషన్‌గా నిలవడమే కాకుండా, అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల సునామీని సృష్టించడం ఖాయం. అయితే ఈ క్రేజీ రూమర్‌పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటనా వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరో విశేషం ఏమిటంటే.. రాజమౌళి తన గత చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్‌ని రాముడిగా చూపించిన విషయం తెలిసిందే. ఆ సీన్లకు సౌత్, నార్త్‌లతో పాటు విదేశాల్లోనే మంచి ఆదరణ లభించింది.
ఇవి కూడా చదవండి:
ఫ్యాన్స్ ప్రెషర్‌ని తట్టుకోవడం ఈ దర్శకధీరుడికే సాధ్యమైంది..
బై ఎలక్షన్ వద్దని చెప్పినా వినని జానీ మాస్టర్ వైఫ్.. ఫలితాలు విడుదల
అభిమానులు అడిగితే కాదనలేను: అల్లు అర్జున్