ఫ్యాన్స్ ప్రెషర్‌ని తట్టుకోవడం ఈ దర్శకధీరుడికే సాధ్యమైంది..
ABN , Publish Date - Aug 09 , 2026 | 07:32 PM
ఈ రోజుల్లో ఒక స్టార్ హీరోతో సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు.. అది నిజంగా కత్తి మీద సామే. సినిమా రిజల్ట్ కొంచెం అటు ఇటు అయినా, ఫ్లాప్ పడినా సోషల్ మీడియాలో వచ్చే హేట్ రేట్, నెగెటివిటీని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు.
ఈ రోజుల్లో ఒక స్టార్ హీరోతో సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు.. అది నిజంగా కత్తి మీద సామే. సినిమా రిజల్ట్ కొంచెం అటు ఇటు అయినా, ఫ్లాప్ పడినా సోషల్ మీడియాలో వచ్చే హేట్ రేట్, నెగెటివిటీని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఇక హీరో పుట్టినరోజు వస్తుందంటే చాలు.. ఫ్యాన్స్ కంటే ముందే దర్శకులు, నిర్మాతలు తీవ్రమైన టెన్షన్‌లో పడిపోతుంటారు. తమ అభిమాన హీరోను ఎలివేట్ చేసేలా ఒక టీజరో, గ్లింప్సో రిలీజ్ చేయాలి.. లేదంటే ఫ్యాన్స్ నుంచి వచ్చే ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్స్ ఊహించడం కూడా కష్టమే. కానీ.. వీటన్నింటినీ ఎంతో కూల్‌గా, తనదైన స్టైల్లో హ్యాండిల్ చేసే ఒక్కే ఒక్క దర్శకుడు ఎవరయ్యా అంటే జక్కన్న రాజమౌళినే అని చెప్పాలి. ఫ్యాన్స్ ఎంత ప్రెషర్ పెట్టినా, ఇండస్ట్రీ ఎంత ఆత్రుతగా ఎదురుచూసినా.. తన టైమ్ వచ్చే వరకు రాజమౌళి (SS Rajamouli) అస్సలు తగ్గడు.
సాధారణంగా స్టార్ హీరోలను కష్టపెట్టడానికి వేరే దర్శకులు కాస్త జంకుతారేమో కానీ, జక్కన్న నిఘంటువులో మొహమాటం అనే మాటే ఉండదు. తనకు కావాల్సిన పర్ఫెక్ట్ అవుట్‌పుట్ వచ్చేంత వరకు.. ఆ హీరోల రక్తం పిండేస్తుంటారు. ఇది వేరే ఎవరో చెప్పిన మాటలు కావు.. రాజమౌళితో సినిమాలు చేసిన హీరోలే స్వయంగా ఒప్పుకున్న సత్యం. అయితే, రాజమౌళి పెట్టిన కష్టానికి ప్రతిఫలంగా ఆ హీరోలకు వారి కెరీర్‌లోనే మైండ్ బ్లాక్ అయ్యే బ్లాక్‌బస్టర్ హిట్స్‌ను గిఫ్ట్‌గా ఇస్తాడు. ప్రభాస్, రామ్‌చరణ్, ఎన్టీఆర్.. ఇలా అందరూ జక్కన్న చెక్కిన శిల్పాలే, బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేసినవారే. ఇప్పుడు ఆ వంతు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)ది. గతంలో ఒక టాక్ షోలో ఎన్టీఆర్, మహేష్ బాబుతో అన్న మాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరికీ గుర్తుకొస్తున్నాయి. రాజమౌళితో సినిమా అంటే నీ ఆటలు, పాటలు అన్నీ ఆయనతోనే.. ఇన్నాళ్ల విరామానికి ఆయనతో వడ్డీతో సహా చెల్లించాలి అని ఎన్టీఆర్ సరదాగా చెప్పిన మాటలు ఇప్పుడు నూటికి నూరు శాతం నిజమవుతున్నాయి. ప్రస్తుతం రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ (Varanasi) సినిమా కోసం మహేష్ బాబు ఇప్పటివరకు ఎప్పుడూ లేనంతగా శ్రమిస్తున్నాడు. తన బాడీ లాంగ్వేజ్‌ను, లుక్‌ను పూర్తిగా మార్చేసుకున్నాడు. మొన్న లీకైన ఒక చిన్న వీడియోలోనే మహేష్ కొత్త లుక్ చూసి సోషల్ మీడియా ఊగిపోయింది.
ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు (HBD SSMB) సందర్భంగా ఏదో ఒక పెద్ద గ్లింప్స్ లేదా టీజర్ వస్తుందని ఫ్యాన్స్, మూవీ లవర్స్ చాలా ఆశగా ఎదురుచూశారు. వేరే ఏ దర్శకుడైనా అయితే కచ్చితంగా ఒక చిన్న గ్లింప్స్ అయినా రిలీజ్ చేసేవాడేమో.. కానీ అక్కడ ఉన్నది రాజమౌళి. ఎలాంటి ప్రెషర్‌కూ లొంగకుండా, సింపుల్‌గా రెండు పిక్స్ మాత్రమే రిలీజ్ చేసి వదిలేశాడు. చిత్రమేమిటంటే.. ఆ రెండు పిక్స్ మాత్రమే సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఉదయం నుంచే ఆ ఫొటోలను ఫ్యాన్స్ విపరీతంగా ట్రెండ్ చేస్తూ రికార్డులు సృష్టించారు. ఆ పిక్స్‌లో మహేష్ లుక్ ఎంతో కొత్తగా, రాయల్‌గా కనిపిస్తుండటంతో వారణాసి సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ప్రెషర్ ఎంత ఉన్నా, అందరినీ ఎదురుచూసేలా చేస్తూ.. తాను అనుకున్న శిల్పాన్ని పర్ఫెక్ట్‌గా చెక్కడం ఒక్క రాజమౌళికే చెల్లింది. మరి ఈ క్రేజీ కాంబో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
బై ఎలక్షన్ వద్దని చెప్పినా వినని జానీ మాస్టర్ వైఫ్.. ఫలితాలు విడుదల
అభిమానులు అడిగితే కాదనలేను: అల్లు అర్జున్
‘సుధీర్స్ జోకర్’లో డిటెక్టివ్ జీవన్‌ని చూశారా..