సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

శ్రీకాంత్ వదిలిన ‘మ్యాజిక్ మూవ్‌మెంట్స్’ ఫస్ట్ లుక్

ABN, Publish Date - Oct 02 , 2026 | 01:41 PM

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, శ్రీ లక్ష్మీ శ్రీనివాస బ్యానర్ల సంయుక్త నిర్మాణంలో.. తల్లాడ సాయి కృష్ణ నటిస్తూ, దర్శకత్వం వహిస్తోన్న నూతన చిత్రం ‘మ్యాజిక్ మూవ్‌మెంట్స్’. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని హీరో శ్రీకాంత్ విడుదల చేశారు.

Magic Movements First Look Launch

దర్శకుడు కె. దశరథ్ సమర్పణలో.. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, శ్రీ లక్ష్మీ శ్రీనివాస బ్యానర్ల సంయుక్త నిర్మాణంలో.. తల్లాడ సాయి కృష్ణ (Thallada Sai Krishna) నటిస్తూ, దర్శకత్వం చేస్తోన్న నూతన చిత్రం ‘మ్యాజిక్ మూవ్‌మెంట్స్’ (Magic Movements). ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను గాంధీ జయంతి సందర్భంగా.. హీరో శ్రీకాంత్ (Hero Srikanth) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. హైదరాబాద్‌లో ఈ ఫస్ట్ లుక్ లాంచ్ వేడుక గ్రాండ్‌గా జరిగింది. విభిన్నమైన టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఫస్ట్ లుక్ విడుదల అనంతరం హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘మ్యాజిక్ మూవ్‌మెంట్స్’ టైటిల్ చాలా విభిన్నంగా ఉంది, టైటిల్‌కు తగ్గట్టుగానే వీరికి కూడా మ్యాజిక్ జరగాలని కోరుకుంటున్నాను. సినిమా మంచి విజయం సాధించి.. చిత్రంలోని ప్రతి ఒక్కరికీ మంచి పేరు తీసుకురావాలని, చిత్ర బృందంలోని అందరికీ ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.


దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ.. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మా సినిమా ‘మ్యాజిక్ మూవ్‌మెంట్స్’ ఫస్ట్ లుక్‌ను హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. 17 ఏళ్ల క్రితం ఇదే టైమ్‌‌లో ఆయన నటించిన ‘మహాత్మ’ సినిమా విడుదలైంది. మా లాంటి ఎంతోమందికి ఆ సినిమా అంటే చాలా చాలా ఇష్టం. ఆ సినిమా హిట్ అయ్యి ఎంత మ్యాజిక్‌ను క్రియేట్ చేసిందో, మా ‘మ్యాజిక్ మూవ్‌మెంట్స్’ సినిమాకు కూడా అలాంటి మ్యాజిక్స్ జరగాలని కోరుకుంటున్నాను. మా సినిమాకు ఇంత మంచి సపోర్ట్‌ను హీరో శ్రీకాంత్ అందించేలా చేసిన నటుడు చిట్టికి ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీకాంత్ ఆశీస్సులతో ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాము. సినిమాలో మంచి కంటెంట్ ఉంది. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు వినోద్ నువ్వుల, ప్రణయ్ రాజ్ వంగరి, రాము, ఎడిటర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. గురూజీకి పోటీగా!

వారి ఆశయాలు సదా స్ఫూర్తిదాయకం: చిరంజీవి

ఫేవరెట్ హీరోతోనే పోటీకి శ్రీవిష్ణు.. ఆ వేవ్‌ను తట్టుకోగలడా?

Updated Date - Oct 02 , 2026 | 01:41 PM