'గైరమ్మత్త'.. దివ్వెల మాధురి కొత్త అవతారం! రంగమ్మత్తను మించి

ABN , Publish Date - Apr 27 , 2026 | 02:53 PM

ఫైర్‌బ్రాండ్‌గా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దివ్వెల మాధురి ఇప్పుడు మరోసారి హెడ్ లైన్స్‌లో నిలిచింది. తన మాటలతో, చేష్టలతో ఎప్పుడూ చర్చల్లో నిలిచే ఆమె తన కెరీర్‌ను కొత్త మలుపు తిప్పుకుంటున్నారు.

Divvela Madhuri

దివ్వెల మాధురి నుంచి దువ్వాడ మాధురిగా మారిన తర్వాత ఆమె జాతకమే మారిపోయింది! పొలిటీషియన్‌ దువ్వాడ శ్రీనివాస్‌తో రిలేషన్ షిప్‌లో ఉంటున్న ఆమె క్లాసికల్ డ్యాన్సర్ గానే కాకుండా బిజినెస్ రంగంలో పేరు సంపాదించుకుంటోంది. ఆ మధ్య బిగ్‌ బాస్‌ హౌస్‌లోనూ సందడి చేసిన మాధురి... ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి సిద్ధమైంది. వివాదాలు, కేసులతో నిత్యం వార్తల్లో నిలిచే మాధురి ఇప్పుడు తనలో దాగి ఉన్న నటనా నైపుణ్యాన్ని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.


సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్‌తో చక్కర్లు కొడుతున్న వీడియోలతో పాటు తమ బిజినెస్ ప్రమోషన్స్‌తో అభిమానులకు రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటుంది మాధురి. అలాంటి ఆమె సినిమా ఎంట్రీ ఇస్తుండటం ఇప్పుడు ఆసక్తిరేపుతోంది. నటుడు, దర్శకుడు గవిరెడ్డి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న 'చీన్‌ టపాక్‌ డుం డుం' అనే సినిమాను వై. ఎన్. లోహిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో కీలకమైన 'గైరమ్మత్త' పాత్రను దివ్వెల మాధురి పోషిస్తోంది. విలేజ్ కామెడీ ఎంటర్ టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో అత్తగా పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో ఆమె నటిస్తోంది.

తాజాగా మాధురికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. నర్సీపట్నం , హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. విలేజ్ టాకీస్ బ్యానర్‌పై నాగులపల్లి శ్రీను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిర్మాతగా ఆయనకు ఇదే మొదటి సినిమా. ఫన్ రైడ్‌లా సాగే ఈ చిత్రంలో మాధురి నటిస్తుండటంతో అప్పుడు సినిమాకు కావాల్సినంత హైప్ వచ్చేసింది. మరీ అత్తగా మాధురి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Read Also: Dhanush: వెంకీ... పూర్తి కథతో రండి.. నేను రెడీ

Read Also:KD: The Devil: కేవీఎన్‌ ప్రొడక్షన్‌కు తీరని కష్టాలు...

Updated Date - Apr 27 , 2026 | 03:50 PM