Dhanush: వెంకీ... పూర్తి కథతో రండి.. నేను రెడీ
ABN , Publish Date - Apr 27 , 2026 | 02:07 PM
తమిళ నటుడు ధనుష్‌తో ‘సార్’ సినిమా తీసి విజయం అందుకున్నారు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య బంధం బలపడింది.
తమిళ నటుడు ధనుష్‌తో (Dhanush) ‘సార్’ సినిమా తీసి విజయం అందుకున్నారు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri). అప్పటి నుంచి వీరిద్దరి మధ్య బంధం బలపడింది. ధనుష్ నటించిన ఏ సినిమా తెలుగులో విడుదలైనా వెంకీ అట్లూరి ప్రమోషన్స్‌లో భాగమవుతున్నారు. ‘సార్’ కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుందని చాలాకాలంగా టాక్ నడుస్తోంది. ఈ రూమర్స్ నిజమేనని స్పష్టమైంది.
ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘కర’ (Kara) ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వెంకీ అట్లూరి గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ధనుష్ వెంకీని ఉద్దేశించి మాట్లాడుతూ ‘చివరి నిమిషంలో పిలిచినా వచ్చినందుకు థ్యాంక్స్. మీరు నాకు బ్రదర్‌లాంటివారు. ‘సార్’ లాంటి మంచి చిత్రాన్ని నాకు ఇచ్చారు. 'సార్' తర్వాత మీరో కథ నెరేట్ చేసి.. అదృశ్యమయ్యారు. ఆ కథను సంపూర్ణంగా తీసుకురండి. సినిమా చేయడానికి నేను రెడీగా ఉన్నా. మీ సక్సెస్‌కు చాలా ఆనందిస్తున్నా. మీ గత చిత్రం ‘లక్కీ భాస్కర్’ చాలా నచ్చింది. మీ రాబోయే సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్' కు కూడా శుభాకాంక్షలు’ అని అన్నారు. ధనుష్ నటించిన 'కర' సినిమా ఈ నెల 30న విడుదల కానుంది.