M4M Movie: బాలయ్య మెచ్చిన 'హూ ఈజ్ ద కిల్లర్' సాంగ్...
ABN, Publish Date - Apr 14 , 2026 | 12:03 PM
మోహన్ వడ్లపట్ల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'ఎం4ఎం' మూవీ మే 8న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా విడుదలైన 'హూ ఈజ్ ద కిల్లర్' అనే పాటను నందమూరి బాలకృష్ణకు చూపించి, ఆయన ఆశీస్సులు తీసుకున్నారు హీరోయిన్ జో శర్మ.
మోహన్ వడ్లపట్ల (Mohan Vadlapatla) స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా 'ఎం4ఎం' (M4M). జో శర్మ (Jo Sharma) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో మే 8న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సినిమాలోని 'హూ ఈజ్ ద కిల్లర్' అనే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. దీనిని తెలుగు, హిందీ భాషల్లో ఆదిత్య మ్యూజిక్ సంస్థ రిలీజ్ చేసింది. ఆకట్టుకునే ట్యూన్‌తో, ఎనర్జిటిక్ మ్యూజిక్ అండ్ విజువల్స్‌తో ఉన్న ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది.
తాజాగా ఈ పాటను చిత్ర కథానాయిక జో శర్మ... నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ను కలిసి, ఆయనకు చూపించారు. విజువల్స్, ప్రెజెంటేషన్ చూసి బాలకృష్ణ చిత్ర బృందాన్ని అభినందించారు. అంతేకాకుండా 'ఎవడు వాడు' అనే క్యాచీ లైన్‌ను ఆయన సరదాగా హమ్ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ నుండి ఆశీస్సులుల తీసుకున్నట్టు జో శర్మ తెలిపారు. బాలకృష్ణ ఆత్మీయంగా తమను రిసీవ్ చేసుకుని, అభినందనలు తెలుపడంతో తమలో కొత్త ఉత్సాహం నెలకొందని జో శర్మ అన్నారు. జో శర్మతో పాటు సమ్బీత్ ఆచార్య ఇందులో కీలక పాత్రను పోషించారు.