సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ‘M4M’.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!

ABN , Publish Date - Jun 01 , 2026 | 03:57 PM

సరికొత్త కాన్సెప్ట్‌, థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే, ఉత్కంఠభరిత కథనంతో రూపొందిన చిత్రం ‘M4M’ (Motive for Murder). జో శర్మ హీరోయిన్‌గా పరిచయమైన ఈ చిత్రానికి మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించారు.

M4M Movie Success Celebrations

సరికొత్త కాన్సెప్ట్‌, థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే, ఉత్కంఠభరిత కథనంతో రూపొందిన చిత్రం ‘M4M’ (Motive for Murder). జో శర్మ (Jo Sharma) హీరోయిన్‌గా పరిచయమైన ఈ చిత్రానికి మోహన్ వడ్లపట్ల (Mohan Vadlapatla) దర్శకత్వం వహించారు. McWin Group USA సహకారంతో మోహ‌న్ మీడియా క్రియేష‌న్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇప్పటివరకు రాని ఒక వినూత్నమైన ‘సైకాలజికల్ క్రైమ్ థ్రిల్లర్’ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. ఇండియాలోనే కాకుండా, అమెరికాలోనూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఈ చిత్ర సక్సెస్‌ను పురస్కరించుకుని మేకర్స్ సెల్రబేషన్స్ నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్‌లో చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌తో పాటు సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు.


ఈ సందర్భంగా జో శర్మ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. అమెరికాలో నాల్గవ వారం కూడా ఈ సినిమా రన్ అవుతోంది. ఇండియాలో కూడా ఈ సినిమా రెండు వారాల పాటు సక్సెస్‌ఫుల్‌గా నడిచింది. దర్శకుడు, నిర్మాత అయిన మోహన్ వడ్లపట్లకు ఈ సినిమా చాలా మంచి పేరు తీసుకొచ్చింది. సినిమా చూసిన వారంతా ఆయనను అభినందిస్తున్నారు. స్మాల్ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ సాధించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రేక్షకులు, మీడియా అందరూ ఎంతగానో సపోర్ట్ చేసి సక్సెస్ చేసినందుకు థ్యాంక్స్..’’ అని తెలిపారు.


దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. ఈ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన అందరికీ థ్యాంక్స్. విడుదలైన అన్ని చోట్ల చాలా మంచి స్పందన వచ్చింది. అమెరికాలో సక్సెస్ సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. మా మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కూడా ఫైనలైంది. జూన్ 18 నుంచి చాలా ఓటీటీలలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. అమెజాన్, లయన్స్ గేట్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ వంటి చాలా ఓటీటీ‌లో జూన్ 18 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. త్వరలోనే ‘M4M’ సీక్వెల్ అనౌన్స్‌మెంట్ కూడా చేయబోతున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యునరేషన్.. ఇదీ రష్మిక రేంజ్!

టాలీవుడ్ వర్క్ కల్చర్‌పై దీపికాకు జాన్వీ కౌంటర్!

Tollywood: విజయ దాహార్తి తీర్చని మే మాసం!

Updated Date - Jun 01 , 2026 | 03:57 PM

M4M Movie Review: జో శర్మ నటించిన M4M మూవీ రివ్యూ

M4M Movie: బాలయ్య మెచ్చిన 'హూ ఈజ్‌ ద కిల్లర్' సాంగ్‌...

M4M: ఫస్ట్ డే సినిమా చూసిన వారికి రూ. లక్ష గెలుచుకునే అవకాశం

M4M: తెలుగు సినిమాకు కేన్స్‌లో దక్కిన అరుదైన ఘనత  

M4M: హాలీవుడ్ రేంజ్‌ సస్పెన్స్ థ్రిల్లర్ చూసేందుకు సిద్ధమా..