ఐకాన్ స్టార్‌ను ఢీకొట్టే ఆ పవర్‌ఫుల్ విలన్ ఎవరు..?

ABN , Publish Date - Jun 09 , 2026 | 07:12 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం రాకా (Rakaa) సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కోలివుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం రాకా (Raaka) సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కోలివుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కి సిద్దమవుతోంది. ఇక దీని తరువాత బన్నీ- మాస్టర్ మైండ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో ఓ భారీ పాన్ ఇండియా చిత్రం రూపుదిద్దుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి.సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ ఎవరూ అనేదానిమీద చర్చలు జరగడం వింటూనే ఉంటాం. కానీ, మొదటిసారి AA23 సినిమాలో అల్లు అర్జున్‌ను ఢీకొట్టబోయే ఆ పవర్‌ఫుల్ విలన్ ఎవరు అనేదానిపై చర్చ నడుస్తోంది.


లోకేష్ కనగరాజ్ సినిమాల్లో హీరో క్యారెక్టర్‌తో పాటు విలన్ క్యారెక్టర్ కూడా అంతే పవర్‌ఫుల్‌గా, వైల్డ్‌గా ఉంటుంది. మాస్టర్ లో విజయ్ సేతుపతి, విక్రమ్ లో విజయ్ సేతుపతి, సూర్య.. లియో లో సంజయ్ దత్ లాంటి స్టార్లను విలన్లుగా చూపించిన లోకేష్.. అల్లు అర్జున్ సినిమా కోసం ఒక స్టార్ హీరోని విలన్‌గా దింపబోతున్నట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ లేదా బాలీవుడ్‌కి చెందిన ఓ టాప్ స్టార్‌ను ఈ నెగెటివ్ రోల్ కోసం సంప్రదించారని, ఆ క్యారెక్టరైజేషన్ వింటే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.


మరోవైపు, ఈ సినిమా లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కాబోతుందా లేదా అనేది కూడా ఈ విలన్ క్యారెక్టర్‌తోనే ముడిపడి ఉందట. ఒకవేళ ఎల్‌సీయూ లోని పాత విలన్లలో ఎవరైనా కనిపిస్తారా, లేక అల్లు అర్జున్ కోసం సరికొత్త విలన్ ని లోకేష్ పరిచయం చేయబోతున్నాడా అనే సస్పెన్స్ నడుస్తోంది. ఈ క్రేజీ విలన్ ఎవరనేదానిపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వస్తే కానీ ఈ సస్పెన్స్‌కి తెరపడదు. ఇంకోపక్క కూలీ కోసం నాగార్జున లాంటి విలన్ ని దింపినా లోకేష్ విజయాన్ని దక్కించుకోలేకపోయాడు. బన్నీ కోసం పవర్ ఫుల్ విలన్ తో పాటు.. స్ట్రాంగ్ కథను కూడా ఎంచుకుంటే ఈ సినిమాకు తిరుగులేదని అంటున్నారు. మరి లోకేష్ .. బన్నీ కోసం ఎంత స్ట్రాంగ్ కథను రాస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి:

మనిషివా.. దేవతవా.. సాయిపల్లవి నువ్వు

‘పెద్ది’ కట్ చేసిన సీన్స్ నాకు ఇచ్చేయండి..: బుచ్చిబాబుకు జగపతి డిమాండ్

మ్యాడ్ డైరెక్టర్ తో కార్తీ సినిమా ఆగిపోయిందా.. ?

Updated Date - Jun 09 , 2026 | 07:23 PM