రియల్‌ ట్రాన్స్‌జెండర్స్‌తో 'ఎల్.జి.బీ.టీ. ఏ లీగల్ బ్యాటిల్'

ABN , Publish Date - Jun 10 , 2026 | 05:14 PM

అవార్డ్ విన్నింగ్‌ మూవీస్‌ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి తాజా చిత్రం 'ఎల్.జి.బి.టి. ఏ లీగల్‌ బ్యాటిల్‌' ఈ నెల 19న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో రియల్‌ ట్రాన్స్ జండర్స్ కీలక పాత్రలు పోషించారు.

LGBT A Legal Battle

సామాజిక ఇతివృత్తాల నేపథ్యంలో చిత్రాలను రూపొందించే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ పై సుభాష్ చక్రవర్తి రవడ సహ నిర్మాతగా గే, ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల జీవితాల మీద తీసిన కోర్ట్ రూమ్ డ్రామా 'ఎల్ జి బీ టీ - ఏ లీగల్ బ్యాటిల్'. ఈ చిత్రంలో ఎల్.బి. శ్రీరామ్, ఎస్తర్ నార్నోన్హ, రాజు ఖేర్, ఆనంద చక్రపాణి, ప్రీతీ నిగమ్‌తో పాటు రియల్ ట్రాన్స్‌జెండర్‌ యాక్టర్స్ ప్రధాన పాత్రలు పోషించారు. హిమా రాథోడ్ హీరోయిన్‌గా, చంద్రముఖి, లైలా వంటి ప్రముఖ యాక్టివిస్టులు, గే యాక్టివిస్ట్ విష్ణు తేజ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 19న దేశవ్యాప్తంగా సినిమా విడుదల కాబోతోంది.

ఈ సందర్భంగా జరిగిన మీడియా మీట్‌లో తెలంగాణ స్టేట్ ట్రాన్స్ జెండర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లైలా మాట్లాడుతూ, 'మా హక్కుల కోసం ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నాం. కానీ మాకు సరైన వేదిక ఎక్కడా లభించలేదు. డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు మా సమస్యల ఇతివృత్తంతో ఈ సినిమాను రూపొందించడం హ్యాపీగా ఉంది. మేము నటులం కాదు. కానీ మా జీవితంలో మేం ఎలా ఉంటామో అలాంటి పాత్రలనే డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు ఈ చిత్రంలో తెరకెక్కించారు. మేం ఈ సినిమాలో మా నిజ జీవిత పాత్రలనే పోషించాం. ఈ సినిమా ద్వారా మేం సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వస్తాయని ఆశిస్తున్నాం' అని అన్నారు.


గే కమ్యూనిస్ట్ యాక్టివిస్ట్ విష్ణు మాట్లాడుతూ, 'గే కమ్యూనిటీ కోసం దాదాపు 12 ఏళ్లుగా పోరాడుతున్నాను. మన సినిమాల్లో గే క్యారెక్టర్స్‌ను కామెడీ కోసం ఉపయోగించడం చూశాం. కానీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌కు వచ్చే అనేక చిత్రాల్లో ఎంతో డెప్త్‌గా గే కమ్యూనిటీ సమస్యలను తెరకెక్కించడం నేను గమనించాను. ఇతర రాష్ట్రాల్లో గే లైఫ్ మీద ఇన్ డెప్త్ మూవీస్ సీరియస్ అప్రోచ్‌తో వచ్చాయి. ఆ సినిమాల వల్ల అక్కడి సమాజం గే కమ్యూనిటీని చూసే విధానం మారిపోయింది. తెలుగులో ఫస్ట్ టైమ్ అలాంటి ప్రయత్నం డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆయన మాతో ట్రావెల్ చేసి మా జీవితాన్ని దగ్గరగా గమనించారు. ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాకు మీ సపోర్ట్ దక్కాలి. ఈ చిత్రంతో మా జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశిస్తున్నాం'' అని అన్నారు.

ట్రాన్స్ జెండర్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ సనా ఖాన్ మాట్లాడుతూ, 'మా జీవితాలు ఎలా ఉంటాయి అనేది చాలా మందికి తెలియదు. బయట ప్రపంచం చూడని మా జీవిత ప్రయాణాన్ని, మా సమస్యలు, భావోద్వేగాలను ఈ చిత్రంలో దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డిగారు చూపించారు. మేం ఏంటి అనేది కాకుండా మా ప్రతిభ అందరికీ తెలియాలి. ఇంకా మాకు మరిన్ని అవకాశాలు దక్కాలని కోరుకుంటున్నాం. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం'' అని అన్నారు. ట్రాన్స్ జెంటర్ ఇన్ స్టాగ్రామ్ యాక్టివిస్ట్ హీరోయిన్ హిమ రాథోడ్ మాట్లాడుతూ, ''ఈ మూవీతో మమ్మల్ని సమాజం చూసే తీరు మారుతుందని, మా మీద అందరిలో ఉన్న అపోహలు తొలగిపోతాయని ఆశిస్తున్నాను' అని అన్నారు.


WhatsApp Image 2026-06-10 at 4.21.09 PM.jpeg

డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, 'సమానత్వం ఉందని చెప్పుకునే మన దేశంలో ట్రాన్స్ జెండర్స్ విషయంలో తీవ్రమైన వివక్ష ఎదురవుతోంది. ట్రాన్స్ జెండర్స్ మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కానీ అవి పోలీస్ స్టేషన్స్‌లో కేసులుగా నమోదు కావడం లేదు. కోర్టుల దాకా వెళ్లి జడ్జిమెంట్ పొంది శిక్షలు పడటం లేదు. ఇప్పటిదాకా ఒక్క ట్రాన్స్ జెండర్ కేసు కూడా ఏ కోర్టులోనూ తుది తీర్పు వచ్చి శిక్ష పడలేదు. ఇంతకంటే అన్యాయం మరొకటి ఉండదు. ఫస్ట్ టైమ్ మన సినిమాలోనే ఒక ట్రాన్స్ జెండర్ కేసులో పూర్తి న్యాయం జరిగినట్లు చూపిస్తున్నాం. ఈ సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది, అలాగే సీరియస్ ఇష్యూస్ చెబుతున్నాం. కేవలం మల్టిఫ్లెక్స్ ల్లో మాత్రమే ఈ నెల 19న మా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. మీ ఆదరణ ఉంటే సింగిల్ స్క్రీన్స్ లోనూ రిలీజ్ చేస్తాం. ఒక కొత్త తరహా కంటెంట్ చూడాలనుకునే ప్రేక్షకులు మా సినిమాకు రావొచ్చు. పుణెలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో మా సినిమాకు బెస్ట్ ఫిలిం అవార్డ్ దక్కింది. ఫిలిం ఫెస్టివల్స్ కు మాత్రమే ఇలాంటి సినిమాలు పరిమితం కావొద్దు. జనాల మధ్యలో డిస్కషన్ కు రావాలి అనేది మా ఉద్దేశం. గే అండ్ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ గురించి నేను చేసిన చిత్రమిది. సెన్సార్ విషయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాం' అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

భారతీరాజా ‘సీతాకోకచిలుక’ హ్యాపీ ఎండింగ్‌కి కారణమిదే: ఏడిద రాజా

భారతీరాజా మృతికి ప్రముఖుల నివాళి

‘పెద్ది’ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ! నార్త్, ఓవర్సీస్‌లో ఇక తిరుగులేనట్టే!

బాలయ్య అన్‌స్టాపబుల్ జోష్

Updated Date - Jun 10 , 2026 | 05:20 PM