శోభన్ బాబు సతీమణి శాంతకుమారి కన్నుమూత
ABN, Publish Date - Jul 09 , 2026 | 07:38 PM
దివంగత నటుడు శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి కన్నుమూశారు.
దివంగత నటుడు శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి కన్నుమూశారు. చెన్నైలో నివాసం ఉంటున్న ఆమె వయోభారంతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. మే 15 1958లో శోభన్‌బాబుకు శాంతకుమారితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా వెలుగొందిన శోభన్‌బాబు 2008లో గుండెపోటుతో కన్నుమూశారు. అప్పటి నుంచి శాంతకుమారి కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైలోనే నివసిస్తున్నారు. శాంతకుమారి మరణవార్త తెలిసిన వెంటనే శోభన్‌బాబు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులర్పిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
బాడీ డబుల్ లేకుండా 20 గంటల పాటు ఫైట్.. రష్మిక రేర్ రికార్డ్
ధనుష్ ‘ఓమ్’లో బాలీవుడ్ దిగ్గజం.. క్రేజీ అప్డేట్
ఇది చాలు సార్.. కన్నీళ్లు తెప్పిస్తోన్న నిరంజన్ తండ్రి మాటలు