మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్.. కనకరాజు కుమ్మేశాడు
ABN, Publish Date - Aug 10 , 2026 | 04:41 PM
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించి, హారర్ కామెడీగా తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’ విడుదలైన మూడు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ను దాటుకుని లాభాల బాటలోకి అడుగుపెట్టింది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) చాలా గ్యాప్ తర్వాత మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపిస్తున్నారు. ఆయన హీరోగా నటించి, హారర్ కామెడీగా తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju) విడుదలైన మూడు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ను దాటుకుని లాభాల బాటలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాపై మేకర్స్ మొదటి నుంచి పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టింది. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ రెస్పాన్స్ను రాబట్టుకున్న ఈ చిత్రం.. ఆ తర్వాత దానిని కంటిన్యూ చేస్తూ మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ను చేరుకోవడంతో.. మేకర్స్ యమా హ్యాపీగా ఉన్నారు.
ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ సినిమాకు బిగ్ ప్రమోషన్గా మారడంతో.. రోజురోజుకూ ‘కొరియన్ కనకరాజు’కి ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్కు చేరువలో ఉన్నట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అలాగే, తొలి వీకెండ్లో ప్రపంచవ్యాప్తంగా రూ.37.4 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లుగా తెలుపుతూ, మేకర్స్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ సోమవారం తెలంగాణలో బోనాలు సెలవు కావడంతో సినిమాకు మరో అడ్వాంటేజ్ లభించినట్లైంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అద్భుతంగా ఉండటంతో, ఈ హాలిడే రోజు కూడా కనకరాజు కుమ్మేసే అవకాశం లేకపోలేదు.
ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్లో ప్రధానంగా కామెడీకి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. వరుణ్ తేజ్, సత్య కాంబినేషన్ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. అలాగే కొన్ని సన్నివేశాలపై నడుస్తోన్న కాంట్రవర్సీ కూడా ఈ సినిమాను వార్తల్లో ఉంచేలా చేస్తోంది. వరుణ్, సత్యల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలవడంతో పాటు, రిపీటెడ్ ఆడియెన్స్కు కారణమవుతున్నాయి. మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం.. ప్రస్తుతం రికవరీ దశను బీట్ చేసింది. ఇక ఈ సినిమా ఎంత పెద్ద ప్రాఫిట్ అందుకుంటుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న మౌత్ టాక్, కామెడీకి లభిస్తోన్న ఆదరణను చూస్తుంటే.. ‘కనకరాజు’కు లాంగ్ రన్ ఉండే అవకాశం లేకపోలేదు. చూద్దాం.. ఏం జరుగుతుందో?
ఇవి కూడా చదవండి:
నన్ను ఇంకా చిన్నపిల్లాడిగానే చూస్తున్నారు: సీఎం విజయ్ తనయుడు
మెగా ట్రీట్.. ‘వారణాసి’లో రాముడిగా మహేష్.. హనుమంతుడిగా ఎవరంటే
ఫ్యాన్స్ ప్రెషర్ని తట్టుకోవడం ఈ దర్శకధీరుడికే సాధ్యమైంది..