సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రమేష్ వర్మ కొత్త బ్యానర్‌లో ‘కొక్కొరొకో’.. .

ABN, Publish Date - Nov 10 , 2026 | 06:50 PM

రమేష్ వర్మ ఆర్‌.వి. ఫిల్మ్ హౌస్‌పై నిర్మిస్తున్న తొలి చిత్రం ‘కొక్కొరొకో’ షూటింగ్ పూర్తయింది. శ్రీనివాస్ వసంతాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి శీను, పార్వతి ప్రేమకథను పరిచయం చేస్తూ అందమైన గ్లింప్స్‌ను విడుదల చేశారు.

Kokkoroko Movie

ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ.. కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆర్‌.వి ఫిల్మ్ హౌస్‌ను ప్రారంభించారు. ఈ బ్యానర్‌పై తొలి సినిమాగా ‘కొక్కొరొకో’ రూపొందుతోంది. ఐదు విభిన్న పాత్రలతో తెరకెక్కుతోన్న ఈ ఆంథాలజీ ద్వారా శ్రీనివాస్ వసంతాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రీసెంట్‌గానే ‘కొక్కొరొకో’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతూ ఓ అందమైన గ్లింప్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో శీను, పార్వతి ప్రేమకథను చూపించారు. శీను కోసం పార్వతి ఎదురుచూస్తుండగా.. ఆమెను సర్‌ప్రైజ్ చేయడానికి చెరువులో నుంచి పూలు సేకరించి తీసుకొస్తుంటాడు. ఇలా వీరిద్దరి మధ్య జరిగే చిన్న చిన్న సంఘటనలు, అమాయకమైన ప్రేమను ఈ గ్లింప్స్‌లో అందంగా చూపించారు. అందమైన విజువల్స్, మనసుకు హత్తుకునే భావోద్వేగాలతో ఈ చిన్న గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. వెండితెరపై ఓ అందమైన ప్రేమకథను చూడబోతున్నామనే ఆసక్తిని కలిగిస్తోంది. శ్రీనివాస్ వసంతాల కథ చెప్పే విధానంపై నమ్మకంతోనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ బాధ్యతలను ఆయనకు అప్పగించినట్టు రమేశ్‌ వర్మ తెలిపారు.


'కొక్కొరొకో' సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ ప్రముఖ గాయకుడు జీవీ సాగర్. సీనియర్ రచయిత జి. సత్యమూర్తి తనయుడైన ఆయన.. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కు సోదరుడు. ‘కొక్కొరొకో’ సినిమాకు జీవీ సాగర్ మాటలు అందిస్తున్నారు. తండ్రి రచనా వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఇప్పటికే ‘రాక్షసుడు’ తర్వాత డైలాగ్ రైటర్‌గా ఆయన చేస్తున్న రెండో సినిమా ఇది. ఈ చిత్రానికి ఆకాష్ ఆర్. జోషి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. లండన్‌కు చెందిన ప్రతిభావంతుడైన సంగీతకారుడు సంకీర్తన్ సంగీతం సమకూరుస్తున్నారు. డా.జ‌యంతి లాల్ స‌మ‌ర్పణలో పెన్ స్టూడియోస్‌, ఆర్‌.వి.స్టూడియోస్ బ్యాన‌ర్స్‌పై ఈ చిత్రాన్ని రేఖా వర్మ, కూరపాటి శిరీష నిర్మిస్తుండగా.. నీలాద్రి ప్రొడక్షన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రమేష్ వర్మ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేను అందించారు. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇందులో సముతిరఖని, సునీల్, చైతన్య రావు మదాడి, మురళీ కృష్ణ, త్రిష్, సప్తగిరి, సుబ్బరాజు, ప్రవీణ్, రామలింగ, శ్రీనివాస్ వడ్లమాని, జెమిని సురేష్, పమ్మి సాయి, గోపిక ఉదయ, ప్రియాంక కుమార్, ప్రీతి నేహా, బేబీ ఎం.వి. కృతి నందన, చాముండేశ్వరి చౌదరి, లక్ష్మి, వేద్విక సోనీ, అశోక్ కుమార్, గుల్లు దాదా (అద్నామ్ సాజిద్ ఖాన్), వినోద్ సాగర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

మూడోసారి విడాకులు?.. పవన్ కళ్యాణ్ మరో యుద్ధం చేయాల్సిందే

సూర్య నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు టైటిల్ ఫిక్స్.. మరో హిట్ రాసిపెట్టుకోండమ్మా

విజయ్ సేతుపతి జైత్రయాత్ర.. వరుస రిలీజ్‌లతో ఫుల్ బిజీ

Updated Date - Nov 10 , 2026 | 07:04 PM