KJQ: ‘కింగ్ జాకీ క్వీన్’ రిలీజ్ ఖరారు.. ఎప్పుడంటే
ABN, Publish Date - Jul 18 , 2026 | 12:17 PM
ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న మరో ఆసక్తికరమైన చిత్రం ‘KJQ – King Jackie Queen’. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న మరో ఆసక్తికరమైన చిత్రం ‘KJQ – King Jackie Queen’. 1990ల కాలం నేపథ్యంలో సాగే పీరియడ్ క్రైమ్ డ్రామాగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో ‘దసరా, ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దీక్షిత్ శెట్టి (Deekshith Shetty) హీరోగా నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో నూతన నటుడు శశి ఓదెల (Shashi Odela) నటిస్తోన్న ఈ చిత్రంలో యుక్తి తరేజా (Yukti Thareja) హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కేకే గత ఏడాది కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయనకు సినిమాపై ఉన్న ప్యాషన్, విజన్‌కి నివాళిగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించారు.
ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, అలాగే టైటిల్ వంటి వన్నీ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ‘కేజేక్యూ- కింగ్ జాకీ క్వీన్’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా తెలుపుతూ మేకర్స్ ఓ పోస్టర్ వదిలారు. ఈ రిలీజ్ డేట్ పోస్టర్‌లో ముగ్గురు ప్రధాన పాత్రలను స్ప్లిట్ ఫ్రేమ్‌లో చూపించారు. మధ్యలో శశి ఓదెల గన్‌తో ఇంటెన్స్ లుక్‌లో ఆకట్టుకోగా, తుపాకీ గురిపెట్టి కనిపిస్తున్న దీక్షిత్ శెట్టి లుక్ ఆకట్టుకుంటోంది. కుడివైపు యుక్తి తరేజా గ్లామరస్ లుక్‌లో కనిపిస్తూ తన పాత్రలోని మిస్టరీని సూచిస్తున్నారు.
ఈ చిత్రానికి నాగేశ్ బనెల్ సినిమాటోగ్రఫీ అందించగా, పూర్ణచంద్ర తేజస్వి సంగీతం సమకూరుస్తున్నారు. శ్రవణ్ కటికనేని ఎడిటర్‌గా, శ్రీకాంత్ రామిశెట్టి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. చిత్ర రిలీజ్ డేట్‌ను ప్రకటించిన సందర్భంగా మేకర్స్ ఇకపై సినిమా ప్రమోషన్స్‌ను మరింత వేగవంతంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిపారు.
ఇవి కూడా చదవండి:
చిరుకి వదినగా చేసినా.. నాగ్ ఫ్యామిలీతోనే బాండింగ్ ఎక్కువ: సుధ
ఫెడరేషన్‌కు షాకిస్తూ.. నిర్మాతలకు జానీ, సుమలత మాస్టర్స్ లేఖలు
తెల్లచీర, మల్లెపూలు.. స్రవంతి చొక్కారపు ఏంటి కథ?