తెల్లచీర, మల్లెపూలు.. స్రవంతి చొక్కారపు ఏంటి కథ?

ABN, Publish Date - Jul 17 , 2026 | 09:37 PM

తెల్లచీర, మల్లెపూలు..  స్రవంతి చొక్కారపు ఏంటి కథ? 1/10

బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ కమ్ నటి స్రవంతి చొక్కారపు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తూనే ఉంటుంది.

తెల్లచీర, మల్లెపూలు..  స్రవంతి చొక్కారపు ఏంటి కథ? 2/10

అటు గ్లామరస్ అవుట్‌ఫిట్స్‌తో పాటు.. ఇటు ట్రెడిషనల్ లుక్స్‌తోనూ నెటిజన్లను కట్టిపడేసే ఈ బ్యూటీ, తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

తెల్లచీర, మల్లెపూలు..  స్రవంతి చొక్కారపు ఏంటి కథ? 3/10

పండగ వాతావరణాన్ని తలపించేలా పక్కా ట్రెడిషనల్ అవతారంలో మెరిసిపోయి అందరి దృష్టిని ఆకర్షించింది.

తెల్లచీర, మల్లెపూలు..  స్రవంతి చొక్కారపు ఏంటి కథ? 4/10

ఈ లేటెస్ట్ ఫొటోషూట్‌లో స్రవంతి తెల్లటి చీర కట్టుకుని, తల నిండా మల్లెపూలు పెట్టుకుని అచ్చమైన తెలుగు ఆడపడుచులా మెరిసిపోతోంది.

తెల్లచీర, మల్లెపూలు..  స్రవంతి చొక్కారపు ఏంటి కథ? 5/10

గోల్డ్ జరి బోర్డర్, ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న వైట్ శారీకి మ్యాచింగ్ బ్లౌజ్ ధరించిన ఆమె, మెడలో పర్ల్ నెక్లెస్, చేతులకు నిండుగా గాజులు వేసుకుని దేవకన్యలా కనిపిస్తోంది.

తెల్లచీర, మల్లెపూలు..  స్రవంతి చొక్కారపు ఏంటి కథ? 6/10

సాంప్రదాయ కట్టుబాట్లలో స్రవంతి చిరునవ్వులు చిందిస్తూ ఇచ్చిన పోజులు కుర్రకారు గుండెల్లో మల్లెలు చల్లేలా ఉన్నాయి.

తెల్లచీర, మల్లెపూలు..  స్రవంతి చొక్కారపు ఏంటి కథ? 7/10

ఈ బ్యూటిఫుల్ ఫొటోలతో పాటు ఆమె పెట్టిన క్యాప్షన్ కూడా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

తెల్లచీర, మల్లెపూలు..  స్రవంతి చొక్కారపు ఏంటి కథ? 8/10

‘రెండు కళ్లు సరిపోతలే.. రెప్ప ముయ్యాలనిపిస్తలే.. నువ్వు తప్ప కనిపిస్తలే.. నీలా ఎవరూ అనిపిస్తలే...’ అంటూ వేసిన ఈ పొయిటిక్ లైన్స్ ఈ ఫొటోల అందాన్ని మరింత పెంచేశాయి.

తెల్లచీర, మల్లెపూలు..  స్రవంతి చొక్కారపు ఏంటి కథ? 9/10

ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్, ఫాలోయర్స్.. ‘‘మల్లెపూల తోటలా ఉన్నావు’’, ‘‘ట్రెడిషనల్ లుక్‌లో అస్సలు తట్టుకోలేకపోతున్నాం’’, ‘లవ్‌లీ’ అంటూ లవ్ సింబల్స్‌తో లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

తెల్లచీర, మల్లెపూలు..  స్రవంతి చొక్కారపు ఏంటి కథ? 10/10

ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇంకొందరైతే.. ‘తెల్లచీర కట్టావు.. మల్లెపూలు పెట్టావు.. ఏంటి కథ?’ అంటూ ఏదైనా విశేషముందా అని ప్రశ్నిస్తున్నారు.

Updated at - Jul 17 , 2026 | 09:40 PM