సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Zee Studios: ఇంద్రపుత్రగా కిరణ్‌ అబ్బవరం!

ABN, Publish Date - Aug 10 , 2026 | 12:08 PM

కిరణ్‌ అబ్బవరం కొత్త సినిమా ప్రకటన వెలువడింది. ప్రేరణా అరోరా, జీ స్టూడియోస్ తో కలిసి 'ఇంద్రపుత్ర' పేరుతో ఓ మైథలాజికల్ మూవీని నిర్మించబోతున్నారు.

Kiran Abbavaram

యువ కథానాయకుడు కిరణ్‌ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ'తో తన ఖాతాలో మరో రూ. 50 కోట్ల సినిమాను జమ చేసుకున్నాడు. 'క', 'కె-ర్యాంప్' తర్వాత కిరణ్‌ అబ్బవరం నటించిన 'చెన్నై లవ్ స్టోరీ'కి డివైడ్ టాక్ వచ్చినా... కలెక్షన్స్ మాత్రం నిర్మాతలను సంతృప్తి పరిచాయి. ఈ విజయంతో రెట్టిన ఉత్సాహంతో కిరణ్‌ అబ్బవరం ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే అతని 13వ చిత్రానికి తనే దర్శకత్వం వహిస్తున్నాడు. దీనికి 'రియాలిటీ' అనే పేరును పరిశీలిస్తున్నారు. ఈ సినిమాతో కన్నడ నటి దేవికా భట్ తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెడుతోంది. జాయ్ ఫిలిమ్స్ బ్యానర్ పై సుధాకర్ చాగంటి దీనిని నిర్మిస్తున్నారు. ఈ మూవీని డిసెంబర్ లో విడుదల చేయాలన్నది కిరణ్‌ అబ్బవరం ఆలోచన. ఆ తర్వాత అతని 14వ సినిమా సుకుమార్ రైటింగ్స్ లో ఉండబోతోంది. అశోక్ బండ్రెడ్డి, వంశీ నందిపాటి నిర్మించే ఈ చిత్రంతో సుకుమార్ శిష్యుడు వీరా కోగటం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇదో క్రైమ్ థిల్లర్ మూవీ.


దీని తర్వాత కిరణ్‌ అబ్బవరం మరో పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ మధ్య సుధీర్ బాబుతో 'జటాధర' చిత్రాన్ని నిర్మించిన ప్రేరణా అరోరా జీ స్టూడియో తో కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఓ పోస్టర్ ద్వారా స్వయంగా కిరణ్‌ అబ్బవరం సోమవారం చేశాడు. ఈ మైథలాజికల్ మూవీకి 'ఇంద్రపుత్ర' అనే పేరు పెట్టారు. అక్టోబర్ లో ఇది సెట్స్ పైకి వెళుతుంది. వచ్చే యేడాది జనం ముందుకు వస్తుంది. ఈ సినిమాను శ్రీకాంత్‌ పుప్పాల డైరెక్ట్ చేయబోతున్నాడు. దీనిని ఒక సినిమాగా కాకుండా సినిమాటిక్ యూనివర్శ్ గా తీయబోతున్నట్టు తెలుస్తోంది. అందులో 'ఇంద్రపుత్ర' అనేది మొదటి ఛాప్టర్!

సో.. కిరణ్‌ అబ్బవరం లైన్ ఆర్డర్ చూస్తుంటే... ఈ యేడాది రెండు సినిమాలు, వచ్చే యేడాది రెండు సినిమాలు రాబోతున్నాయి. ఈ చిత్రాల నిర్మాతల జోరు గమనిస్తే... ఈ చిత్రాలను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి రూపకల్పన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ చిత్రాలతో కిరణ్‌ అబ్బవరం తన స్థాయిని ఏమేరకు పెంచుకుంటాడో చూడాలి.

ఇవి కూడా చదవండి:

మ‌త్తు ఇచ్చి న‌టిపై అత్యాచారం.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అరెస్ట్‌

ఫ్యాన్స్‌ ప్రెషర్‌ని తట్టుకోవడం ఈ దర్శకధీరుడికే సాధ్యమైంది..

Updated Date - Aug 10 , 2026 | 12:14 PM