ఒక అమ్మాయిని ఇంతలా ప్రేమించవచ్చా..: కిరణ్ అబ్బవరం
ABN , Publish Date - Jul 15 , 2026 | 11:03 PM
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా.. ‘కలర్ ఫొటో, బేబి’ వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తోన్న చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’.
హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), శ్రీ గౌరి ప్రియ (Sri Gouri Priya) జంటగా.. ‘కలర్ ఫొటో, బేబి’ వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తోన్న చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story). అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి సాయి రాజేశ్ కథను అందిస్తుండగా.. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం జూలై 24న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం గ్రాండ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం పుట్టినరోజును మేకర్స్ సెలబ్రేట్ చేశారు.
అనంతరం హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ‘చెన్నై లవ్ స్టోరీ’ మరో 9 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా నాకొక మెమొరబుల్ ఫిలిం. కొన్నేళ్ల తర్వాత నేను నటించిన చిత్రాల్లో ఏదైనా మళ్లీ చూడాలనుకుంటే మాత్రం కచ్చితంగా ఈ సినిమా చూస్తాను. నా కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇది. ఈ సినిమా సక్సెస్ పై నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను. ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుందని నమ్ముతున్నాను. మా ప్రొడ్యూసర్స్‌కు బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. మా సినిమాతో పాటు వేరే సినిమాలు పోటీ ఉన్నా.. ఈ నెల 24నే రిలీజ్‌కు వస్తున్నాం. సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి సందేహం లేదు. మా మూవీ కంటెంట్ పై అంత నమ్మకంతో ఉన్నాం. కంటెంట్ బాగున్న మూవీనే ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం.
సినిమా మీద ప్రేమతోనే నిర్మాత, దర్శకుడిగా మారాను. ఈ ఐదారేళ్లలో ప్రేక్షకుల దగ్గర నుంచి ఎంతో ప్రేమను సంపాదించుకున్నాను. ఇక్కడ ఎత్తుపల్లాలు, ఒడిదొడుకులు ఎన్నో చూశాను. మంచి సినిమాలు చేసి ప్రేక్షకుల ఆదరణ పొందాలనే నిత్యం ప్రయత్నిస్తున్నాను. ఈ చిత్రంలో ప్యూర్ లవ్ స్టోరీ చూస్తారు. సినిమా మొత్తం నేను హీరోయిన్‌ను అండి, మీరు అనే పిలుస్తాను.. అంత గౌరవిస్తాను. ఈ మూవీలో నటిస్తున్నప్పుడు ఒక అమ్మాయిని ఇంతలా ప్రేమించవచ్చా, ఇంతలా ట్రీట్ చేయవచ్చా అని అనిపించింది. ఇందులోని సీన్స్‌కు అందరూ అంత బాగా రిలేట్ అవుతారు. సినిమా పాటలు చూసి మీరు క్లాస్ అనుకుంటున్నారు. కానీ ఇది ప్రాపర్ మాస్ మూవీ. ఈ సినిమాలోని పాత్రలు, వాటి నేపథ్యం సాలిడ్ మాస్‌తో ఉంటాయి. డైలాగ్స్, స్టోరీలోని బ్లాక్స్ మాస్‌కే ఎక్కువ కనెక్ట్ అవుతాయని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
బాలయ్య బిడ్డ తేజస్విని డ్యాన్స్‌ల వెనుక మతలబు ఏంటి? హీరోయిన్‌గా ఏమైనా..
KA13: కిరణ్ అబ్బవరం పుట్టినరోజు స్పెషల్‌గా క్రేజీ మేకింగ్ వీడియో
మరోసారి దిల్ రాజు వర్సెస్ మైత్రీ.. దేవుడిపై భారం వేసిన ఎస్కేఎన్