ఒక్క సినిమా రిలీజ్ కాకుండానే మూడు ఛాన్స్‌లు.. టాలీవుడ్లో గహజీ జోరు!
ABN, Publish Date - Oct 23 , 2026 | 04:05 PM
కేరళ యువనటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గహజీ తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటోంది. రోషన్ కనకాల కొత్త సినిమా, ‘విహారి’, సాయిలు కంపాటి తెరకెక్కిస్తున్న ‘బబ్లూ డబుల్ ఎక్స్ ఎల్’ చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూడు సినిమాలపై టాలీవుడ్లో ఆసక్తి నెలకొంది.
తెలుగు సినిమాల్లో కొత్త అమ్మాయిల పరిచయం అనేది ప్రవాహంలా సాగిపోతోంది. యంగ్ ఫిల్మ్ మేకర్స్ న్యూ టాలెంట్ వెనక పడుతుండటంతో పక్క రాష్ట్రాల అమ్మాయిలకు నక్క తోక తొక్కినట్టు అవుతోంది. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే తెలుగులో మరో రెండు, మూడు సినిమాల్లో కూడా కొందరు ఎంపిక అవుతున్నారు. సినిమాలకే కాదు... హీరోయిన్ల విషయంలోనూ మౌత్ టాక్ బాగా పనిచేస్తున్నట్టు అనిపిస్తోంది. అలా ఈ మధ్య కాలంలో మొదటి సినిమా సెట్స్ మీద ఉండగానే మరో ఛాన్స్ పట్టేసిన భామల జాబితాలోకి కేరళ యువ నటి, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్, ఆర్మీ ఆఫీసర్ డాటర్ గహజీ కూడా చేరిపోయింది.
రోషన్ కనకాల సోలో హీరోగా ఇంతవరకూ రెండు సినిమాలు వచ్చాయి. మొదటిది 'బబుల్ గమ్'. ఈ సినిమాతో మానసా చౌదరి హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని పొందకపోయినా... మానసా చౌదరికి తెలుగులో ఆ తర్వాత మరికొన్ని అవకాశాలు వచ్చాయి. అలానే రోషన్ నటించిన సెకండ్ మూవీ 'బబ్లూ'. ఈ సినిమాతో సాక్షి మడోల్కర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కూడా కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేదు. కానీ సాక్షి ఇప్పుడు శ్రీవిష్ణు సరసన 'ఫ్యామిలీ ప్యాక్'లోనూ, సందీప్ కిషన్ 'కరికాల' చిత్రంలోనూ నాయికగా నటిస్తోంది. ఇక ఇప్పుడు రోషన్ నటిస్తున్న మూడో సినిమా విషయానికి వద్దాం. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాతో విజయ్ కె కామిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవీ ఆనంద్ చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ కమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటర్. ఈ సినిమాలో మలయాళీ భామ గహజీ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఇది ఆమె తొలి చిత్రం కాదు. దీనికంటే ముందే 'విహారి' అనే సినిమాతో గహజీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కన్నా పసునూరి హీరోగా ఆషీ జొన్నలగడ్డ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఆమె కథానాయిక. అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే గహజీ ఇప్పుడు ముచ్చటగా మూడో అవకాశాన్ని అందిపుచ్చుకుంది. అదే 'రాజు వెడ్స్ రాంబాయి' మేకర్ సాయిలు కంపాటి తెరకెక్కిస్తున్న 'బబ్లూ డబుల్ ఎక్స్ ఎల్' మూవీ.
ప్రముఖ నిర్మాతలు పుష్కార్ రామ్ మోహన్ రావు, భరత్ ఎన్ నారంగ్ నిర్మిస్తున్న 'బబ్లూ' మూవీలో సుమంత్ ప్రభాస్ హీరో. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. దసరా కానుకగా మూవీ టైటిల్‌ను ఇతర నటీనటులు సాంకేతిక వర్గాన్ని మేకర్స్ ప్రకటించారు. గహజీ ఎస్.కే. హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలను రాధికా శరత్ కుమార్, జయలలిత, శివాజీరాజా తదితరులు పోషిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు. సో... కేరళ కుట్టీ గహజీ ఇప్పుడు తెలుగులో చేస్తున్న ఈ మూడు ప్రాజెక్ట్స్ హీరోలు, టెక్నీషియన్స్ కారణంగా మంచి క్రేజ్ ఉన్నవే. ఈ సినిమాలు సక్సెస్ అయితే... గహజీ మరికొన్ని ఆఫర్లను సొంతం చేసుకుని, కనీసం రెండు మూడేళ్ళు టాలీవుడ్లో తన సత్తాను చాటే ఛాన్స్ ఉంటుంది. అయితే... ఈ మూడు చిత్రాలలో ఏది తొలుత జనం ముందుకు వస్తుందో చూడాలి!
ఇవి కూడా చదవండి:
ప్రభాస్ కోసం ‘మిరాయ్’ డైరెక్టర్ మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్
Prabhas: టాలీవుడ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టార్‌కు హ్యాపీ బర్త్‌డే
నిజమైన హీరోలేనా.. లేక ‘డూప్’లా? ‘జైలర్ 2’తో మొదలైన కొత్త చర్చ