సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పవన్ కళ్యాణ్‌‌తో ఒకే ఒక్క ఛాన్స్.. : నటి కావ్యశ్రీ

ABN, Publish Date - Sep 17 , 2026 | 09:22 PM

బుల్లితెర ప్రేక్షకులకు ‘గోరింటాకు’ సీరియల్‌తో పరిచయమై, ఆ తర్వాత పలు సీరియల్స్‌లోనూ, షోస్‌లోనూ సందడి చేస్తూ.. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న కన్నడ బ్యూటీ కావ్యశ్రీ.. తాజాగా పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Kavyashree and Pawan Kalyan

బుల్లితెర ప్రేక్షకులకు ‘గోరింటాకు’ సీరియల్‌తో పరిచయమై, ఆ తర్వాత పలు సీరియల్స్‌లోనూ, షోస్‌లోనూ సందడి చేస్తూ.. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న కన్నడ బ్యూటీ కావ్యశ్రీ (Kavyashree). తాజా ఈ భామ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పట్ల తనకున్న అభిమానాన్ని, అలాగే ‘బిగ్ బాస్’ రియాలిటీ షోపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గురించి ఆమె మాట్లాడిన తీరు మెగా, జనసేన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.


ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తావన రాగానే కావ్యశ్రీ ఎంతో ఉత్సాహంగా స్పందించారు. ‘‘పవర్ స్టార్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆయన మాట్లాడే మాటలు వింటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది, గూస్‌బంప్స్ వచ్చేస్తాయి. అంతటి గొప్ప లీడర్‌ను, నటుడిని చూడటం మన అదృష్టం. ఆయనతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలనేది నా చిరకాల కోరిక. హీరోయిన్‌గా కాకపోయినా పర్లేదు.. ఆయన పక్కన ఏదో ఒక చిన్న క్యారెక్టర్ రోల్ చేసే ఛాన్స్ వచ్చినా ఎగిరి గంతేసి చేస్తాను’’ అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు.


మరోవైపు బుల్లితెరపై అత్యంత క్రేజ్ ఉన్న ‘బిగ్ బాస్’ షో (Bigg Boss Show)కి వెళ్లే ఆలోచన ఉందా.. అన్న ప్రశ్నకు కావ్యశ్రీ ఆసక్తికర సమాధానమిచ్చారు. తనకు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే ఆలోచన అస్సలు లేదని స్పష్టం చేశారు. ‘‘బిగ్ బాస్ షో అంటే నాకు చాలా ఇష్టం.. ఒక ప్రేక్షకురాలిగా నేను దాన్ని రోజూ టీవీలో ఫాలో అవుతుంటాను, బాగా ఎంజాయ్ చేస్తాను. కానీ వ్యక్తిగతంగా అక్కడికి వెళ్లాలని మాత్రం అనుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ ఎలాంటి గొడవలు జరుగుతాయో, ఏ పరిస్థితులు ఎదురవుతాయో అందరికీ తెలుసు. బయట మనం చాలా పద్ధతిగా, ప్రశాంతంగా ఉంటాం. కానీ హౌస్‌లోకి వెళ్లాక పరిస్థితుల ప్రభావంతో ఆ ఇమేజ్ ఎక్కడ పాడవుతుందోననే భయం నాకు ఉంటుంది. అందుకే బిగ్ బాస్‌ను టీవీలో చూడటమే తప్ప, అక్కడికి కంటెస్టెంట్‌గా వెళ్లకూడదని ఫిక్స్ అయ్యాను’’ అని కావ్యశ్రీ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

క్రికెట్‌లో లెజెండే.. పడకగదిలో ఆకట్టుకోలేదు: రోహిత్ శర్మపై నటి షాకింగ్ కామెంట్స్

నేనెప్పుడు చెప్పాను.. సినిమాలకు గుడ్‌బై వార్తలపై అను స్పందనిదే

‘వారణాసి’ నుంచి క్రేజీ అప్‌డేట్.. జక్కన్న మాస్టర్ ప్లాన్ అదేనా?

Updated Date - Sep 17 , 2026 | 09:22 PM