సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అతనితో రిలేషన్ వర్కవుట్ కాలేదు.. ఆ తర్వాత ఎవరితో కమిట్ కాలేదు: కావ్యశ్రీ

ABN, Publish Date - Sep 09 , 2026 | 08:16 PM

సీరియల్స్‌లో ఎప్పుడూ సంప్రదాయ పద్ధతిలోనే చీరల్లో కనిపించే కావ్యశ్రీ.. నిజజీవితంలోనూ వెస్ట్రన్ దుస్తుల కన్నా భారతీయ సంప్రదాయ వస్త్రధారణకే ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

Kavya Shree

బుల్లితెర ప్రేక్షకులకు ‘గోరింటాకు’ సీరియల్‌తో పరిచయమై, ఆ తర్వాత పలు సీరియల్స్‌లోనూ, అలాగే షోస్‌లోనూ సందడి చేస్తూ.. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు కన్నడ బ్యూటీ కావ్యశ్రీ (Kavya Shree). హోమ్లీ లుక్, సహజసిద్ధమైన నటనతో అలరించే ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, డ్రెస్సింగ్ అలవాట్లు, రిలేషన్‌షిప్‌లపై మనసు విప్పి మాట్లాడారు. సీరియల్స్‌లో ఎప్పుడూ సంప్రదాయ పద్ధతిలోనే చీరల్లో కనిపించే కావ్యశ్రీ.. నిజజీవితంలోనూ వెస్ట్రన్ దుస్తుల కన్నా భారతీయ సంప్రదాయ వస్త్రధారణకే ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. తాను బయటకు వెళ్లినా కుర్తీలు, పంజాబీ డ్రెస్సులే ఎక్కువగా ధరిస్తానని, పండుగలు లేదా శుభకార్యాలు వస్తే తప్పకుండా చీరలే కట్టుకుంటానని స్పష్టం చేశారు. ఒకవేళ ఎప్పుడైనా జీన్స్ వంటి వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకుంటే తనకే ఏదోలా, అసౌకర్యంగా అనిపిస్తుందని నవ్వుతూ చెప్పుకొచ్చారు.


తన ప్రేమ, పెళ్లి విషయాలపై కూడా కావ్యశ్రీ ఆసక్తికర సమాధానాలిచ్చారు. గతంలో ఎప్పుడైనా రిలేషన్‌షిప్‌లో ఉన్నారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. తాను గతంలో ఒకరితో రిలేషన్‌లో ఉన్నానని, అయితే అది వర్కవుట్ కాక పరస్పర అంగీకారంతో విడిపోయామని ఓపెన్‌గా వెల్లడించారు. ఆ తర్వాత నుంచి తాను సింగిల్‌గానే ఉంటున్నానని, మళ్లీ ఇప్పటివరకు ఎవరితోనూ కమిట్ కాలేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో తనతో జీవితాన్ని పంచుకోబోయే వ్యక్తికి ఉండాల్సిన లక్షణాల గురించి చెబుతూ.. లుక్స్, అందం కంటే ఎదుటివారి వ్యక్తిత్వమే తనకు ముఖ్యమని తెలిపారు. తనను అమితంగా ప్రేమించే మనసు ఉండాలని, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ గౌరవించుకునే తత్వం ఉంటే చాలని తన డ్రీమ్ బాయ్ క్వాలిటీస్‌ను పంచుకున్నారు.


తనకు తమిళ, మలయాళ భాషలతో పోలిస్తే తెలుగు ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలు ఎంతో ప్రత్యేకమని కావ్యశ్రీ భావోద్వేగంతో చెప్పారు. ఇతర భాషల పరిశ్రమల కంటే టాలీవుడ్ ప్రేక్షకులే తనను సొంత కుటుంబ సభ్యురాలిగా గుండెల్లో పెట్టుకున్నారని, ఎక్కడికి వెళ్లినా ‘కృష్ణ’ అంటూ పిలుస్తూ చూపించే అభిమానం వెలకట్టలేనిదని కృతజ్ఞతలు తెలిపారు. సినిమాల్లో అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తానని, అయితే అందాల ఆరబోతకు తావులేకుండా కథకు ప్రాధాన్యత ఉండి, చక్కటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రలైతేనే ఒప్పుకుంటానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న విశేషాలు ప్రస్తుతం బుల్లితెర వీక్షకులను, నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి:

‘మండాడి’కి యుబైఏ.. విడుదలకు సిద్ధం

ఓవర్సీస్‌లో ‘ది ప్యారడైజ్‌’ మాస్‌ జాతర.. సునామి రాబోతోందా

Mahendragiri Vaarahi: 'మురారి'కి దీనికి సంబంధం లేదు!

Updated Date - Sep 09 , 2026 | 08:16 PM