సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kasthuri Shankar: హీరోల పాత్రపై కస్తూరి సెటైర్స్‌.. నెటిజన్ల కౌంటర్స్‌

ABN, Publish Date - Sep 05 , 2026 | 10:08 AM

నటి కస్తూరి గురించి పరిచయం అక్కర్లేదు. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో సినిమాలు, సీరియళ్లతో బిజీగా గడుపుతున్నారు.

నటి కస్తూరి గురించి పరిచయం అక్కర్లేదు. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో సినిమాలు, సీరియళ్లతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం తెలుగులో ’ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్‌తో ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకున్నారు. ఆ మధ్యన తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌లో 2లో కూడా భాగమైంది. 2019లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా మరోసారి బిగ్‌బాస్‌ ఇంట అడుగుపెట్టింది. అంతే కాదు సామాజిక అంశాలపై కూడా బహిరంగంగా చర్చిస్తుంటారామె. అలా మాట్లాడి ఇబ్బందులు పడ్డారు. కేసుల్లో చిక్కుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా స్టార్‌ హీరోలు చేస్తున్న క్యారెక్టర్లపై ఆమె కామెంట్లు చేయగా, ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఈ మధ్యకాలంలో హీరోలు స్మగ్లింగ్‌, క్రిమినల్స్‌ లాంటి పాత్రలో నటిస్తున్నారని, అలా అయితేనే జనాలు ఆదరిస్తున్నారా? అనేలా ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

తాజాగా ఆమె ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమాలో నటించారు. డ్రగ్స్‌ మాఫియా, విద్యార్థుల ఆక్రోషం, ఒక సామాన్యుడి పొలిటికల్‌ పోరాటం లాంటి అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మాట్లాడారు. ‘ఒకప్పుడు తెలుగులో మాయాబజార్‌, కృష్ణార్జున యుద్థం, ప్రేమాభిషేకం లాంటి చిత్రాలు చూసి పెరిగాను. తెలుగు సినిమాలలో హీరో అంటే ఆ కాలంలో దేవుళ్లగానే ఎక్కువ కనిపించేవారు. మారుతున్న కాలాన్ని బట్టి పాత్రల్లోనూ మార్పు వచ్చింది. తదుపరి పోలీసు, లాయర్‌, విప్లవాత్మక పాత్రల్లో నటించేవారు. కానీ ఇప్పుడు వస్తున్న చిత్రాల్లో హీరోలు ఎక్కువగా స్మగ్లర్‌, క్రిమినల్‌, గ్యాంగ్‌స్టర్‌ పాత్రల్లోనే నటిస్తున్నారు’ అంటూ కస్తూరి శంకర్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి పాత్రలు చేస్తేనే ప్రేక్షకులు సినిమాలు చూస్తారా? అన్న భావనతో ఆమె మాట్లాడినట్లు నెటిజన్లు భావిస్తున్నారు.

మారుతున్న కాలాన్ని బట్టి ప్రేక్షకుడి అభిరుచి మారుతుంది. దానిని బట్టే దర్శకులు కథలు తయారు చేసుకోవలసి ఉంటుంది. ఒకప్పుడు హీరోలను దేవుళ్ళ పాత్రల్లో చూపించిన దర్శకులే ఇప్పుడు ప్రేక్షకుడి అభిరుచి మేరకు కథలు, పాత్రలు రాస్తున్నారు. ఈ మధ్యలో కల్కి, రామాయణం లాంటి చిత్రాలు వచ్చి ప్రేక్షకుల్ని అలరించాయి. అందులోనూ దేవుళ్ల పాత్రలు ఆకట్టుకున్నాయి. అందుకే ఈ కాలం హీరోలు ఒకే రకం పాత్రలు చేస్తున్నారు అన్నది నిజం కాదు... ప్రేక్షకుడి అభిరుచికి తగ్గట్టు సినిమాలు చేస్తున్నారు అని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

అంతే కాదు స్ర్తీల పాత్రల గురించి కూడా నెటిజన్లు కస్తూరికి కౌంటర్‌ ఇచ్చారు. ‘ఒకప్పుడు హీరోయిన్లు సీతాదేవి లాంటి పాత్రలు చేసేవారు. కానీ ఇప్పుడు వ్యాంప్‌ పాత్రలు కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా క్యారెక్టర్‌ ఒకే తరహాలో ఉంటే ప్రేక్షకుడికి బోర్‌ కొడుతుంది’ అని నెటిజన్లు కస్తూరికి సెటైర్స్‌ వేశారు.

ALSO READ:

Updated Date - Sep 05 , 2026 | 11:23 AM