‘కరికాల’ చిత్రంలో కేథరిన్ థ్రెసా.. ఫస్ట్ లుక్ విడుదల
ABN, Publish Date - Oct 10 , 2026 | 03:59 PM
‘శంబాల’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు, దర్శకుడు యుగంధర్ ముని కలిసి చేస్తోన్న చిత్రంలో హీరోయిన్ ఫిక్సయింది.
‘శంబాల’ (Shambhala) లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు, దర్శకుడు యుగంధర్ ముని కలిసి మళ్లీ ఓ విజువల్ వండర్‌ను క్రియేట్ చేయబోతోన్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై యుగంధర్ ముని (Ugandhar Muni) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘కరికాల’ (Karikaala). మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం రెండు చాప్టర్‌లుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి చాప్టర్ 2027 జూలై 2న , రెండో చాప్టర్ 2027 అక్టోబర్ 28న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ అప్డేట్ వదిలారు.
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్‌లు సినిమాపై మంచి అంచనాల్ని పెంచేశాయి. సోషియో ఫాంటసీ, విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడిగా కేథరిన్ థ్రెసా నటించనున్నట్లుగా తెలుపుతూ.. ఆమెకు వెల్కమ్ చెప్తూ చిత్రయూనిట్ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. సందీప్ కిషన్, కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్ (Catherine Tresa Alexander) తెరపై మొదటిసారిగా కలిసి ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా ఓ డిఫరెంట్ రోల్‌ను పోషించబోతోన్నట్టుగా ఈ పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. వెల్కమ్ ఆన్ బోర్డ్ అంటూ ‘కరికాల’ టీం ఈ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మధ్య కేథరిన్‌కు తెలుగులో పెద్దగా అవకాశాలు లేవనే విషయం తెలియంది కాదు. ఆమెకు ఈ సినిమాలో అవకాశం.. అందులోనూ పాన్ ఇండియా సినిమా కావడంతో.. మళ్లీ ఆమె కంబ్యాక్ ఇచ్చే అవకాశం లభించినట్లయింది. మరి ఈ అవకాశం ఆమెకు ఎంత వరకు యూజ్ అవుతుందో చూద్దాం.
వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్, అత్యద్భుతమైన కథనంతో రూపుదిద్దుకుంటోన్న ‘కరికాల’ చిత్రం.. పాన్ ఇండియన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారతీయ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సోషియో-ఫాంటసీ అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా ఈ మూవీ టీమ్ పని చేస్తోంది. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఇతర నటీనటుల గురించి ఇకపై వరస అప్డేట్స్ ఇవ్వబోతున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు.
ఇవి కూడా చదవండి:
‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్, రశ్మికల స్పందనిదే
రాజమౌళి చెరిపేసిన సెంటిమెంట్స్ ఎన్నో.. ఇప్పుడు ‘వారణాసి’పై కొత్త చర్చ
రజనీకాంత్ - కమల్ హాసన్ భారీ మల్టీస్టారర్ ఆగిపోయిందా?