Kannappa: రీ రిలీజ్ అన్నారు.. యూట్యూబ్‌లోనా?
ABN, Publish Date - Jul 04 , 2026 | 10:23 PM
మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ చిత్రం జూన్ 27తో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ టీమ్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
మంచు విష్ణు (Manchu Vishnu) నటించిన ‘కన్నప్ప’ (Kannappa) చిత్రం జూన్ 27తో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. మరి రీ రిలీజ్‌లో ఈ సినిమా ఎలాంటి స్పందనను రాబట్టుకుందో.. అసలెవరికీ తెలియదు. నిజంగా రీ రిలీజ్ అయ్యిందో, లేదో తెలియనంతగా కామ్‌గా అంతా కానిచ్చేశారు. రీ రిలీజ్‌లో పెద్దగా స్పందన రాకపోవడంతో.. మంచు విష్ణు అండ్ టీమ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే..
ఈ సినిమాను ఫ్రీగా జనాలకు చూపించాలనేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ మూవీ అవా ఎంటర్‌టైన్‌మెంట్ (AVAA Entertainment) యూట్యూబ్ చానెల్‌లో అందుబాటులోకి వచ్చింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం యూట్యూబ్‌లో అందుబాటులో ఉండటం విశేషం. ప్రస్తుతం యూట్యూబ్‌లో అయితే ఈ సినిమా మంచి స్పందననే రాబట్టుకుంటున్నట్లుగా.. వ్యూస్ చూస్తుంటే తెలుస్తోంది. టీమ్ తీసుకున్న ఈ నిర్ణయంతో.. నెటిజన్లు కొందరు రకరకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్‌లో రిలీజ్ చేయడానికి ఈ సినిమా ఓటీటీ రైట్స్ తీసుకున్న సంస్థ ఎలా ఓకే చెప్పింది? లేదంటే ఓటీటీ డీల్‌నే అలా సెట్ చేసుకున్నారా? వన్ ఇయర్ తర్వాత సొంత యూట్యూబ్ ఛానల్‌లో రిలీజ్ చేసుకుంటామనేలా డీల్ మాట్లాడుకున్నారా? అనేలా కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం.. యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తున్నామని చెప్పకుండా.. రీ రిలీజ్ అని ప్రకటించారా? అంటూ సరదాగా కామెంట్స్ చేస్తుండటం విశేషం.
అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల పై ‘కన్నప్ప’ మూవీని డా. ఎం. మోహన్ బాబు నిర్మించిన సంగతి తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, కాజల్, బ్రహ్మానందం ఇలా ఎంతో మంది గొప్ప నటీనటులు కీలక పాత్రలను పోషించిన ఈ చిత్రం పాన్ ఇండియా సినిమా విడుదలైంది.
ఇవి కూడా చదవండి:
సుకుమార్- దేవిశ్రీ ప్రసాద్ కాంబోకి బ్రేక్? కారణమిదేనా?!
ఇదే ఈ బాబాయ్- అబ్బాయ్ డెబ్యూ స్పెషాలిటీ!
అఖిల్ కోసం రంగంలోకి ఎన్టీఆర్? ఇక ఊహించుకోండి!