సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కన్నప్ప బ్యూటీ ఐటెంసాంగ్.. రౌడీ హీరో తట్టుకోగలడా

ABN, Publish Date - May 24 , 2026 | 06:54 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం విజయ్ ఆశలన్నీ రౌడీ జనార్ధన (Rowdy Janardhana) మీదనే పెట్టుకున్నాడు.

Rowdy Janardhana

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం విజయ్ ఆశలన్నీ రౌడీ జనార్ధన (Rowdy Janardhana) మీదనే పెట్టుకున్నాడు. రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో విజయ్ సరసన కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


రౌడీ హీరో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చాలా తక్కువ. కానీ, ఇప్పుడు ప్రతి సినిమాలో హీరోయిన్ తో ఐటెంసాంగ్ చేయించడం ట్రెండ్ గా మారిన విషయం తెల్సిందే. దీంతో విజయ్ కూడా ఆ ట్రెండ్ ని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. రౌడీ జనార్ధనలో ఒక ఐటెంసాంగ్ ఉండనుందంట. దానికోసం కన్నప్ప బ్యూటీని రంగంలోకి దించినట్లు సమాచారం. అందాల భామ ప్రీతీ ముకుందన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆసా కూడా అనే ప్రైవేట్ ఆల్బమ్ తో బాగా ఫేమస్ అయిన ప్రీతీ కన్నప్ప సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.


ఇక రౌడీ జనార్ధనలో ప్రీతీ ఐటెంసాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో.. ఊర మాస్ బీట్ ని విజయ్, ప్రీతీల మీద చిత్రీకరించాలని చూస్తున్నారట. అయితే.. ప్రీతీ మొదటి నుంచి డ్యాన్సర్. కానీ, విజయ్ కి డ్యాన్స్ కి చాలా దూరం. డియర్ కామ్రేడ్ సినిమాకు విజయ్ చాలా కష్టపడి డ్యాన్స్ వేశాడు. ఇప్పుడు ఐటెంసాంగ్ అందులో మాస్ బీట్ అంటే.. చాలా కష్టమని కొందరు అంటున్నారు. ఒకవేళ విజయ్ కష్టమైన మాస్ స్టెప్స్ వేయగలిగితే ఈ సాంగ్ కి తిరుగు ఉండదు అని.. విజయ్ మాస్ స్టెప్స్, ప్రీతీ అందం రెండు కలిస్తే సినిమా బ్లాక్ బస్టరే అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - May 24 , 2026 | 07:25 PM