స్కెరీ పిక్చర్ తో కంగనా భయపెడుతుందట..
ABN , Publish Date - Nov 13 , 2026 | 04:51 PM
టాలీవుడ్‌లో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఒక కొత్త అర్థం చెప్పిన విలక్షణ దర్శకుడు రవిబాబు (Ravi Babu). అనసూయ, అమరావతి, అవును, అవును 2 వంటి చిత్రాలతో ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టి, భయపెట్టడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌ను సృష్టించుకున్నాడు.
టాలీవుడ్‌లో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఒక కొత్త అర్థం చెప్పిన విలక్షణ దర్శకుడు రవిబాబు (Ravi Babu). అనసూయ, అమరావతి, అవును, అవును 2 వంటి చిత్రాలతో ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టి, భయపెట్టడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌ను సృష్టించుకున్నాడు. కామెడీ సినిమాలతో పాటు సరికొత్త ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే రవిబాబు, ఈ ఏడాది రేజర్ అనే వైలెంట్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ, ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. తన మేకింగ్ స్టైల్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆయన, ఇప్పుడు తన మార్క్ హారర్ జోనర్‌తో మరోసారి మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యాడు.
ఈసారి రవిబాబు టాలీవుడ్ కాకుండా బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నాడు. బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ జోనర్‌లోనైనా తన నటనతో సినిమాను ఒంటిచేత్తో నడిపించగల సత్తా ఉన్న కంగనా, ఇప్పుడు మొదటిసారిగా పూర్తిస్థాయి హారర్ థ్రిల్లర్ కథాంశంతో ప్రేక్షకులను భయపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఇద్దరు విలక్షణ ప్రతిభావంతుల కలయికలో స్కేరీ పిక్చర్ అనే హారర్ థ్రిల్లర్ అధికారికంగా ప్రకటించారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దగ్గుబాటి రానా, సురేష్ బాబు ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం.
ఇటు టాలీవుడ్‌లోనూ, అటు బాలీవుడ్‌లోనూ పాన్-ఇండియా స్థాయిలో భారీ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్న రానా, రవిబాబు చెప్పిన ఈ కొత్త హారర్ కాన్సెప్ట్ నచ్చడంతో కంగనా రనౌత్‌తో ఈ క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి మేకర్స్ ఈ చిత్రాన్ని కేవలం హిందీ సినిమాగానే అధికారికంగా అనౌన్స్ చేశారు తప్ప, తెలుగు విడుదలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రవిబాబు, ఈసారి సురేష్ ప్రొడక్షన్స్ అండదండలతో, కంగనా రనౌత్ లాంటి పవర్‌ఫుల్ నటితో గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలని పక్కా ప్లాన్‌తో వస్తున్నాడు. ఈ హారర్ థ్రిల్లర్‌ను 2027లో ఎప్పుడైనా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఖరారు చేసింది. మరి స్కేరీ పిక్చర్ తో కంగనా ప్రేక్షకులను ఏ రేంజ్ లో భయపెడుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
మోక్షజ్ఞ కంటే ముందే.. నందమూరి కుటుంబం నుంచి మరో సినీ ఎంట్రీ!
పుకార్లకు ఫుల్ స్టాప్.. గాడ్ ఆఫ్ వార్ ఆగలేదు
‘SI యుగంధర్’ దర్శకుడితో.. సుధాకర్ కోమాకుల కొత్త ప్రయోగం