పుకార్లకు ఫుల్ స్టాప్.. గాడ్ ఆఫ్ వార్ ఆగలేదు

ABN , Publish Date - Nov 13 , 2026 | 03:46 PM

ఇండస్ట్రీలో పుకార్లు అనేవి సర్వసాధారణం. కొంతమంది ఆ పుకార్లను అలాగే వదిలేస్తారు. ఇంకొంతమంది ఆ పుకార్లకు చెక్ పెడతారు. తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ పుకార్లకు చెక్ పెట్టేశాడు.

God Of War

ఇండస్ట్రీలో పుకార్లు అనేవి సర్వసాధారణం. కొంతమంది ఆ పుకార్లను అలాగే వదిలేస్తారు. ఇంకొంతమంది ఆ పుకార్లకు చెక్ పెడతారు. తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ పుకార్లకు చెక్ పెట్టేశాడు. కేవలం ఒకే ఒక్క ఫోటోతో ట్రోలర్స్ నోరు మూయించాడు. అసలేం జరిగినది అంటే.. గత రెండు రోజులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, తన హోమ్ బ్యానర్ అయిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నుంచి తప్పుకుంటున్నాడని, వీరి బ్యానర్ లో ఓకే అయిన గాడ్ ఆఫ్ వార్ ఆగిపోయిందని రూమర్స్ వచ్చాయి. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది.


ఇక ఈ రూమర్స్ కి నాగవంశీ అడ్డుకట్ట వేశాడు. త్రివిక్రమ్ ఎక్కడికి వెళ్ళడం లేదని, గాడ్ ఆఫ్ వార్ ఆగిపోలేదని తెలుపుతూ ఎన్టీఆర్, త్రివిక్రమ్, నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేసి పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇక ఈ ఒక్కఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. గాడ్ ఆఫ్ వార్ ఆగిపోలేదు అని తెలియడంతో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు మేకర్స్ చెప్పకనే చెప్పుకొచ్చారు.


ఆదర్శకుటుంబంతో గురూజీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేనప్పటికీ గాడ్ ఆఫ్ వార్ ని మాత్రం అద్భుతంగా తీర్చిదిద్దే పనిలో ఉన్నాడని తెలుస్తోంది.2018లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ భారీ చిత్రానికి ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా లాక్ అయ్యాయి.ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటం అంచనాలను ఆకాశానికి చేర్చింది. ప్రస్తుతం తారక్.. డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని ఫినిష్ చేసి వచ్చే ఏడాది ఫ్రెష్ గా గాడ్ ఆఫ్ వార్ సెట్ లో అడుగుపెట్టనున్నాడు. మరి గురూజీ.. ఈసారి ఎన్టీఆర్ ని ఏ రేంజ్ లో చూపించనున్నాడో తెలియాల్సి ఉంది.

Updated Date - Nov 13 , 2026 | 04:10 PM