సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

8 గంటల పని వివాదం.. దీపికానే కరెక్ట్ అన్న కాజల్

ABN, Publish Date - Jul 04 , 2026 | 07:21 PM

ఎన్ని నెలలు అయినా ఈ 8 గంటల పని వివాదం ముగిసేలా కనిపించడం లేదు. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒక హీరోయిన్ దీని గురించి మాట్లాడుతూనే ఉంటున్నారు. తాజాగా చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) టర్న్ వచ్చింది.

Kajal Aggarwal

ఎన్ని నెలలు అయినా ఈ 8 గంటల పని వివాదం ముగిసేలా కనిపించడం లేదు. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒక హీరోయిన్ దీని గురించి మాట్లాడుతూనే ఉంటున్నారు. తాజాగా చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) టర్న్ వచ్చింది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాజల్.. రీఎంట్రీలో స్పీడు పెంచింది. తల్లి అయ్యాక కూడా అమ్మడు వరుస అవకాశాలను అందుకొంటూ బిజీగా మారింది. ప్రస్తుతం అమ్మది చేతిలో మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ది ఇండియా స్టోరీ. చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ ఇండస్ట్రీలో వర్కింగ్ అవర్స్ గురించి మాట్లాడింది.


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గతంలో ఇండస్ట్రీలో వర్కింగ్ అవర్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కుమార్తె సంరక్షణ కోసం రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తానని నిర్మాతలకు నిబంధన పెట్టడంతో ఈ వివాదం మొదలయ్యింది. ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ దీపికాను విమర్శించగా.. కొంతమంది మాత్రం ఆమెకు మద్దతు తెలిపారు. అందులో ఇప్పుడు కాజల్ కూడా చేరింది. తాను దీపికా పదుకొనే నిర్ణయానికి వందకు వంద శాతం మద్దతు ఇస్తున్నానని ఓపెన్‌గా చెప్పింది.


'నేను దీపికా నిర్ణయానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నాను. ఆమె అడిగిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఒక పొజిషన్‌కు చేరుకున్నాక, మన ప్రైయారిటీస్ ఏంటో చూసుకుని ఇలాంటి చిన్న చిన్న అభ్యర్థనలు కోరడంలో తప్పులేదు. కార్పొరేట్ రంగంలో వర్కింగ్ అవర్స్ నిబంధనలు ఉన్నప్పుడు.. పూర్తిగా కార్పొరేట్ పద్ధతిలోకి మారుతున్న సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి విషయాల్లో డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు ఉండాలి. ఒక తల్లిగా మారిన తర్వాత నా బాధ్యతలు, ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయి. నేను సినిమాలు చేసే ముందే కాంట్రాక్ట్ లో నా కండిషన్స్ చెప్తాను. ఆదివారం నేను పనిచేయను.. ఆరోజు నా ఫ్యామిలీకి టైమ్ ఇస్తాను. అంటూ దీపికా తీసుకున్న స్టాండ్‌ను కాజల్ బలంగా సమర్థించింది.ప్రస్తుతం కాజల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Updated Date - Jul 04 , 2026 | 07:53 PM