సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘కదిరి నరసింహుడు’ కాదు.. ‘మెగా158’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది.. అరాచకం అంతే!

ABN, Publish Date - Aug 22 , 2026 | 09:33 AM

మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ఇండస్ట్రీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ కాంబోలో మరోసారి రాబోతోన్న మెగా158 చిత్ర టైటిల్ గ్లింప్స్‌ని మేకర్స్ వదిలారు.

Kaaka Title Glimpse Out

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ఇండస్ట్రీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కలయికలో కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మెగా158’. మెగాస్టార్ పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ సినిమాకు ‘కదిరి నరసింహుడు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం సాగగా, అందరికీ సర్‌ప్రైజ్ ఇస్తూ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ‘కాకా’ (Kaaka) అనే ఊరమాస్ టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా విడుదల చేసిన గ్లింప్స్‌లో చిరు స్వాగ్, బాబీ టేకింగ్ చూసి మెగా ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు.


విడుదలైన టైటిల్ గ్లింప్స్ విషయానికొస్తే.. ఆక్వా ఫ్యాక్టరీ బ్యాక్‌డ్రాప్‌లో సూపర్వైజర్ ‘కె. సత్యం’గా చిరంజీవి కనిపించారు. ‘ఏంట్రా తంబీ.. ఇది సత్యం మాట, ఇంకా డౌటా?’ అంటూ చిరు చెప్పిన డైలాగ్, ఆయన వేసుకున్న ‘ఐ లవ్ డాడ్’ కీచైన్‌తో కూడిన తాళంచెవిని రొటేట్ చేసే స్టైల్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. దీనికి తోడు ఎస్. థమన్ అందించిన ‘పాప రీపాప.. ఆడితే ఆట.. ఇస్తా తోట.. కాకా!’ అంటూ ‘గ్యాంగ్‌లీడర్’ వైబ్‌తో సాగే మాస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్‌లో ఉంది. ఫ్యాక్టరీలో పనిచేసే సాధారణ వ్యక్తిలా కనిపిస్తూనే, లోపల ఉన్న విధ్వంసకర మాస్ కోణాన్ని చిరంజీవి ఆవిష్కరించిన తీరు గ్లింప్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.


ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, ఆంటోనీ ఎల్. రూబెన్ ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ నిర్వహిస్తుండగా.. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే, భాను-నందు డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను సంక్రాంతి కానుకగా 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియాల్లో ‘కాకా’ గ్లింప్స్ రికార్డు వ్యూస్‌తో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

ఇవి కూడా చదవండి:

షావుకారు జానకి జ్ఞాపకాల్లో సినీ పరిశ్రమ

అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ మెగాస్టారే

బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా నటి రాధిక.. ఇదేందయ్యా ఇది

Updated Date - Aug 22 , 2026 | 09:47 AM