NTR NEW LOOK: ఎన్టీఆర్ ట్రాన్స్‌ఫర్మేషన్ కు ఫ్యాన్స్ ఫిదా

ABN , Publish Date - Jan 15 , 2026 | 06:47 PM

మొన్నటి దాకా ఎన్టీఆర్ మేకోవర్ ను చూసి ఫ్యాన్స్ నిరాశపడ్డారు. ఎన్నడూ లేనంత ట్రోల్స్ చేశారు. కొందరైతే ఆ మొహంలో కళ తప్పిందని కామెంట్ చేశారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. ఆ లుక్స్ చూసి కళ్లు తిప్పుకోలేకపోతున్నారు.

సినిమా కోసం ఎంత రిస్క్ అయినా చేసే హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే తన మేకోవర్ మొత్తం మార్చేసుకుంటారు. సన్నబడిపోయినా, సిక్స్ ప్యాక్ చేసినా, జుట్టు పెంచినా తన మార్క్ ను చూపిస్తుంటారు. అలా అప్ కమింగ్ మూవీ కోసం కూడా యంగ్ టైగర్ పూర్తిగా మారిపోయి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తున్నారు. 'దేవర' సినిమాలో కొంచెం బొద్దుగా కనిపించిన యంగ్ టైగర్ 'కేజీయఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న మూవీ కోసం తన లుక్‌ను మార్చుకున్నారు. గతంలో కంటే మరింత బక్క చిక్కిపోయి కనిపిస్తున్నారు. ఇటీవలే బావమరిది నార్నే నితిన్ పెళ్లి వేడుకల్లో కనిపించిన జూనియర్ ఎన్టీఆర్, తన లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత ఒక జువెలరీ బ్రాండ్ ప్రమోషన్‌లో కూడా ఆయన మరింత సన్నగా కనిపించారు. ఈ లుక్ పై ట్రోల్స్ వచ్చినప్పటికీ.. సినిమా కోసం ఎన్టీఆర్ పడ్డ కష్టాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు.


తాజాగా హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్టులో కెమెరాల కంట పడ్డ జూనియర్ ఎన్టీఆర్, ఎంతో పవర్ఫుల్‌గా కనిపించారు. బియర్డ్ లుక్స్ లో సూపర్ స్టైలిష్ గా కనిపించి మెస్మరైజ్ చేశారు. ఈ కొత్త మేకోవర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం కోసమేనని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా మొన్నటి దాకా ట్రోల్స్ ఎదుర్కొన్న తారక్.. ఇప్పుడు సూపర్ గా ఉన్నావంటూ కామెంట్స్ అందుకొంటున్నాడు.

Read Also: Durandhar-2: ‘దురంధర్ 2’ స్టోరీని మార్చేశారా...

Read Also: Mahesh Babu: సౌత్ ఇండియాలోనే ఫస్ట్ డాల్బీ మల్టీఫ్లెక్స్.. మహేశ్ బాబు AMB రేపు ప్రారంభం

Updated Date - Jan 15 , 2026 | 06:47 PM