Durandhar-2: ‘దురంధర్ 2’ స్టోరీని మార్చేశారా...

ABN , Publish Date - Jan 15 , 2026 | 06:21 PM

ఎవరైనా సినిమా హిట్ కోసం క్యారెక్టర్లు రాస్తారు... కానీ క్యారెక్టర్ కోసమే సినిమా తీస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. మొదటి పార్టులో ఇరగదీసిన క్యారెక్టర్ కోసం సెకండ్ పార్ట్ నే తిరిగి మరోసారి చిత్రీకరించారు. బాలీవుడ్ చరిత్రలోనే ఈ విచిత్రం చోటు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

బాలీవుడ్ లో దుమ్మురేపుతున్న లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ స్పై థ్రిల్లర్ 'దురంధర్'. ఇది రణవీర్ సింగ్‌కి కమ్ బ్యాక్ మాత్రమే కాదు, అక్షయ్ ఖన్నాకి నటుడిగా అద్భుతమైన పేరు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా రెహ్మాన్ డకైత్ పాత్రలో అక్షయ్ ఖన్నా గొప్పగా నటించి... స్క్రీన్ మీద చెలరేగిపోయాడు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతున్న 'దురంధర్' సినిమా విజయంతో అందరి దృష్టి 'దురంధర్ 2' మీద పడింది. అయితే ఈ విజయంతో మేకర్స్ అలర్ట్ అయ్యారు. మళ్లీ స్టోరీ లైన్ ను మార్చేస్తున్నట్టుగా తెలుస్తోంది.


'దురందర్' సూపర్ హిట్ కావడంతో.. సెకండ్ పార్ట్ పై ఎక్స్‌పెక్టేషన్స్‌ అమాంతం పెరిగిపోయాయి. దానికి తగినట్టు మేకర్స్ మరింత డ్రామాను జోడిస్తున్నారు. వాస్తవానికి రెండో పార్ట్ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. మార్చి 19, 2026న 'దురంధర్ 2'ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ డైరెక్టర్ ఆదిత్య ధర్ ఇప్పుడు కొన్ని కీలక సన్నివేశాలను రీ-షూట్ చేస్తున్నట్టు రిపోర్టులు వస్తున్నాయి. అంతేకాదు.. ఈ రీషూట్ లో మరో సర్ ప్రైజ్ ఉన్నట్టుగా తెలుస్తోంది.


మొదటి భాగంలో రెహ్మాన్ డకైత్ మరణిస్తాడు. దీంతో ఆ పాత్ర ముగిసిపోయిందని అనుకున్నారు. కానీ ప్రేక్షకుల డిమాండ్‌తో ఆ మోస్ట్ లవ్డ్ క్యారెక్టర్ రెహ్మాన్ డకైత్ 'దురంధర్ 2'లో తిరిగి వస్తాడట. ఈ నెల చివరి నుంచి అక్షయ్ ఖన్నా కు సంబంధించిన సీన్స్ ను రీ-షూట్ చేస్తారని అంటున్నారు. అయితే ఈ పాత్రను తిరిగి ఎలా ప్రవేశపెడతారన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. బహుశా ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌తో ఆ క్యారెక్టర్ బ్యాక్‌స్టోరీని వివరించి, కథను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారేమోనని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఈ న్యూస్ నిజమైతే మాత్రం 'దురంధర్ 2' మీద అంచనాలు మరింత పెరిగే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే రణవీర్ సింగ్ తో పాటు అక్షయ్ ఖన్నా సైతం అంతగా ప్రేక్షకుల అభిమానాన్ని 'దురంధర్'తో పొందాడు.

Read Also: Pongal Movies: రీమిక్స్ ట్రెండ్.. అంతా కిరణ్ అబ్బవరం మాయ

Read Also: Yellamma: ఎల్లమ్మ.. దేవిశ్రీ ప్రసాద్ లుక్ అదిరిందమ్మా

Updated Date - Jan 15 , 2026 | 06:37 PM