Mahesh Babu: దక్షిణ భారతదేశంలోనూ ఫస్ట్ టైమ్...

ABN , Publish Date - Jan 14 , 2026 | 10:05 PM

ఏసియన్ సినిమాస్ తో కలిసి మహేశ్ బాబు బెంగళూరులో నిర్మించిన థియేటర్ల సముదాయం జనవరి 16 నుండి అందుబాటులోకి రానుంది.

AMB Cinemas

ప్రిన్స్ మహేశ్ బాబు (Mahesh Babu) కు ఈ సంక్రాంతి సమ్ థింగ్ స్పెషల్. అతని సినిమాలేవీ విడుదల కాకపోయినా... ఈ కొత్త సంవత్సర ప్రారంభ దినాలు మాత్రం మెమొరబుల్ గా ఉంటాయి. ఎందుకంటే ఈ నెల 10వ తేదీ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ విజయవాడ లెనిన్ సెంటర్ లో జరిగింది. ఆ మర్నాడే రమేశ్‌ బాబు కొడుకు జయకృష్ణ నటిస్తున్న 'శ్రీనివాస మంగాపురం' మూవీ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను మహేశ్ బాబు విడుదల చేశాడు. ఇక సంక్రాంతి కానుకగా బెంగళూరులో మహేశ్ బాబు నెలకొల్పుతున్న ఏఎంబీ సినిమాస్ ప్రారంభమౌతున్నాయి. అలానే అతి త్వరలోనే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని ఏఎంబీ క్లాసిక్ థియేటర్స్ కూడా మొదలవుతాయి.


బెంగళూరులో ఆసియన్ సంస్థతో కలిసి మహేశ్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్స్ ను నిర్మిస్తున్నారు. భోగి రోజున ఆ సినిమా థియేటర్లకు సంబంధించిన సమాచారాన్ని మహేశ్ బాబు అధికారికంగా తన అభిమానులకు తెలియచేశాడు. జనవరి 16 నుండి ఈ థియేటర్లలో చిత్ర ప్రదర్శన మొదలు అవుతుందని తెలిపాడు. దక్షిణ భారతదేశంలోనే తొలి డాల్బీ సినిమా అనుభవాన్ని ఈ థియేటర్స్ ఇస్తాయని, ఇలాంటి అవకాశం కల్పించినందుకు గర్వంగా ఉందని మహేశ్ బాబు పేర్కొన్నాడు. ఇందు కోసం అసాధారణ కృషి చేసిన ఏఎంబీ టీమ్ కు మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలిపాడు. అతి త్వరలోనే బెంగళూరు వాసులను కలుసుకోబోతున్నానని మహేశ్ చెప్పాడు.

Updated Date - Jan 14 , 2026 | 10:05 PM