సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Lalitha: మరోసారి మెగాఫోన్ పట్టిన జొన్నవిత్తుల!

ABN, Publish Date - May 18 , 2026 | 01:28 PM

ప్రముఖ గీత రచయిత జొన్నవిత్తుల మరోసారి దర్శకత్వం వహిస్తున్నారు. లేడీ ఓరియంటెడ్ మూవీ 'లలిత'ను ఆయన నూతన తారలతో తీస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి హీరోయిన్‌ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

Jonnavithulla Ramalingeswara Rao

ప్రముఖ గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మరోసారి మెగాఫోన్ చేతపట్టారు. గతంలో ఆయన రాజేంద్ర ప్రసాద్‌ కథానాయకుడిగా 'పెళ్ళాం పిచ్చోడు', అలీ హీరోగా 'సోంబేరి' చిత్రాలను రూపొందించారు. అయితే ఇప్పుడు ఆ రెండు సినిమాలకూ పూర్తి భిన్నంగా 'లలిత' పేరుతో నూతన తారలతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాస్మిక్‌ పవర్ క్రియేట్స్ ఎల్.ఎల్.పి. బ్యానర్ పై పి. సుధీర్‌ రాజు, డి. వైష్ణవి నేహా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా నందిని హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. హీరోలుగా అభిలాష్‌, అఖిల్‌ వివాన్‌ పరిచయం అవుతున్నారు. 'గర్ల్‌ఫ్రెండ్‌ అంటే బానిస కాదు' అనే కాప్షన్‌తో హీరోయిన్‌ నందినిని పరిచయం చేస్తూ తాజాగా ఓ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తన విశ్వాసం, వ్యక్తిత్వం కోసం నిలబడే ఓ మహిళ కథ ఇదని, సామాజిక నేపథ్యంతో దీనిని తెరకెక్కిస్తున్నామని మేకర్స్ తెలిపారు.


తన చిత్రాలకు సంగీత దర్శకులను ఎంపిక చేసుకోవడంలోనూ జొన్నవిత్తుల వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. 'పెళ్ళాం పిచ్చోడు' చిత్రానికి నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌ సంగీతం సమకూర్చగా, 'సోంబేరి'కి గాయకుడు మనో సంగీతం సమకూర్చారు. ఇక తాజా చిత్రం 'లలిత'కు సంగీతాన్ని భార్యాభర్తలైన మ్యూజికల్‌ డ్యుయో మణి, నాగరాజు అందిస్తున్నారు. నాగరాజు ప్రముఖ వేణు వాదకుడు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి కళారత్న, వేణుగాన విశారద పురస్కరాలు అందుకున్నారు. 'లలిత' చిత్రంలో ఇతర కీలకా పాత్రలను రఘు బాబు, పృథ్వీ రాజ్, తాగుబోతు రమేష్, డీడీ శ్రీనివాస్, వి. ఝాన్సీ మేఘనా, సురేష్ దామరపల్లి, శ్రీవాణి త్రిపురనేని, జయశ్రీ రాచకొండ, మహేంద్రనాథ్, కిరణ్ కళ్యాణ్ కొండ తదితరులు పోషిస్తున్నారు. శ్రష్టి వర్మ కొరియోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలను జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు: జయం రవికి భార్య ఆర్తి కౌంటర్!

కోహ్లీ కుస్తీ ఆడితే ఎలా ఉంటదో.. ‘పెద్ది’ ట్రైలర్‌పై నాగవంశీ

మేము అమ్మ, నాన్నలమయ్యాం: జబర్దస్త్ నటుడు ఎమోషనల్!

Mega158: మాస్ వర్కవుట్స్‌తో మెగా158 అప్డేట్.. చిరు వీడియో వైరల్!

Updated Date - May 18 , 2026 | 01:39 PM