సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మాస్ మహారాజాకి విలన్ గా జేడీ చక్రవర్తి..

ABN, Publish Date - Oct 06 , 2026 | 01:41 PM

ఇరుముడి తరువాత మాస్ మహారాజా రవితేజ జోష్ పెంచాడు. నిజం చెప్పాలంటే రవితేజకు విజయాపజయాలతో పనిలేదు. సినిమాలు చేసుకుంటూ పోతాడు. ప్రస్తుతం రవితేజ చేతిలో రెండు, మూడు సినిమాలు ఉన్నాయి.

ఇరుముడి తరువాత మాస్ మహారాజా రవితేజ (Raviteja) జోష్ పెంచాడు. నిజం చెప్పాలంటే రవితేజకు విజయాపజయాలతో పనిలేదు. సినిమాలు చేసుకుంటూ పోతాడు. ప్రస్తుతం రవితేజ చేతిలో రెండు, మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ సినిమాకు తులాభారం అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు టాక్ నడుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన క్యాస్టింగ్ వివరాలు ప్రస్తుతం ఫిలింనగర్ సర్కిల్స్‌లో వైరల్‌గా మారాయి. విభిన్నమైన కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కథానాయికగా నటి ప్రియాంక మోహన్ ఎంపిక కాగా, మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ మరొక కీలకమైన పాత్రలో నటిస్తుందని, ఈమధ్యనే వీరిద్దరికీ ఫోటోషూట్ జరిగిందని తెలుస్తోంది.


అయితే ఈ సినిమాలో మెయిన్ అట్రాక్షన్ కాబోతున్న నెగెటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్ర కోసం ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి పేరు పరిశీలనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జోష్ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా ఎంట్రీ ఇచ్చిన జేడీ చక్రవర్తి.. ఆ తరువాత పలు సినిమాల్లో కనిపించాడు కానీ, ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. తాజాగా తులాభారం చిత్రంలో హీరోకి ధీటుగా సాగే పవర్‌ఫుల్ విలన్ క్యారెక్టర్ కోసం జేడీ అయితేనే పర్ఫెక్ట్‌గా సరిపోతారని చిత్ర యూనిట్ భావిస్తోందట.


ఇప్పటికే ప్రియాంక మోహన్, అనస్వర రాజన్ కాంబినేషన్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచగా, ఇప్పుడు జేడీ చక్రవర్తి ఎంట్రీ వార్త సినిమాపై క్రేజ్‌ను రెట్టింపు చేసింది. ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. మరి ఈ సినిమాతో జేడీ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

ఇవి కూడా చదవండి:

‘డ్రాగన్’ భారీ షెడ్యూల్.. ఎన్టీఆర్ రీఎంట్రీ అక్కడేనా?

నెట్‌ఫ్లిక్స్‌లో అన్న - అమెజాన్‌లో తమ్ముడు.. దుమ్మురేపుతున్నారు

డీప్‌ఫేక్‌లు, ఆన్‌లైన్ వేధింపులపై విష్ణు మంచు కీలక నిర్ణయం

Updated Date - Oct 06 , 2026 | 01:41 PM