సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బై ఎలక్షన్ వద్దని చెప్పినా వినని జానీ మాస్టర్ వైఫ్.. ఫలితాలు విడుదల

ABN, Publish Date - Aug 09 , 2026 | 07:25 PM

ఇటీవల తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలియంది కాదు. మెగాస్టార్ చిరంజీవి, ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్.. ఇలా అందరూ అసోసియేషన్‌లో ఎటువంటి గొడవలు లేకుండా, సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు.

Dancers Association By Election

ఇటీవల తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌ (Telugu Film And TV Dancers and Dance Directors Association)లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలియంది కాదు. మెగాస్టార్ చిరంజీవి, ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్.. ఇలా అందరూ అసోసియేషన్‌లో ఎటువంటి గొడవలు లేకుండా, సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. దాదాపు సమస్య ముగిసిందని చెబుతూ మీడియా సమావేశం కూడా నిర్వహించారు. కానీ, వారందరి మాటని లెక్క చేయకుండా జానీ మాస్టర్ వైఫ్, అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత (Sumalatha) రిజైన్ చేసిన సభ్యుల స్థానాలకు ఆదివారం (ఆగస్ట్ 9) బై ఎలక్షన్ నిర్వహించారు. అంతకుముందు పెద్దల మాటను, ఫెడరేషన్ నిర్ణయాన్ని లెక్కచేయని సుమలతపై పలువురు డ్యాన్సర్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు సహాయ నిరాకరణ చేస్తున్నట్టుగా కూడా ఫెడరేషన్ ప్రకటించింది. అయినప్పటికీ సుమలత వెనక్కి తగ్గలేదు.


దాదాపు 600 మంది సభ్యులు ఉన్న అసోసియేషన్‌లో 502 మందికి ఓటు హక్కు ఉండగా.. కేవలం 116 మంది మాత్రమే ఈ బై ఎలక్షన్‌లో పాల్గొన్నారంటే.. ఈ పరిస్థితుల్లో ఈ ఎన్నికలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, భాను మాస్టర్ వంటి వారంతా ఈ ఎన్నికలకు దూరంగా ఉండి, తమ అభిప్రాయం ఏంటో స్పష్టం చేశారు. ఇక ఈ ఉప ఎన్నికల ఫలితాలను కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్, న్యాయ సలహాదారుడైన వి. సామ్రాట్ అశోక్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. మొత్తం 502 ఓట్లు ఉండగా.. 114 ఓట్లు మాత్రమే పోలాయ్యాయి.. వాటిలో 2 ఓట్లు చెల్లనివిగా గుర్తించినట్లుగా తెలిపారు. ఈ బై ఎలక్షన్ ఫలితాలు ఇలా ఉన్నాయి.

ఈ ఎన్నికల్లో కొన్ని పదవులు ఏకగ్రీవంగా నిర్ణయించబడ్డాయి. ఉపాధ్యక్షులుగా G. శంకర్ (కార్డు నెం. 53), జాయింట్ సెక్రటరీగా P. నాగ మల్లేశ్వర్ రావు (కార్డు నెం. 481), ఆర్గనైజింగ్ సెక్రటరీగా G. రవితేజ (బన్ని) (కార్డు నెం. 481).. కమిటీ సభ్యులుగా P. కన్నయ్య (కార్డు నెం. 177), M. రమేష్ (చరణ్) (కార్డు నెం. 500), M. రాములు (కార్డు నెం. 531), B. వెంకన్న (కార్డు నెం. 415) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


ప్రధాన కార్యదర్శి పదవికి జరిగిన పోటీలో G. బాలకృష్ణ (బాలు. G) (కార్డు నెం. 426) 68 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన ప్రత్యర్థి B. శ్రీనివాస్ గౌడ్ (లడ్డు శ్రీను) (కార్డు నెం. 77) 23 ఓట్లు పొందారు. కోశాధికారి పదవికి జరిగిన ఎన్నికల్లో P. ఇశ్రాయేలు (తడివేలు) (కార్డు నెం. 212) 79 ఓట్లు సాధించి, 34 ఓట్లు పొందిన G. వీరస్వామిపై 45 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మహిళా కమిటీ సభ్యుల విభాగంలో K. నిరంజని (కార్డు నెం. 234) 79 ఓట్లు, CH. సాయి లక్ష్మి (కార్డు నెం. 325) 65 ఓట్లు సాధించి విజేతలుగా నిలిచారు. T. శ్రావణ సంధ్య (కార్డు నెం. 389) 59 ఓట్లు పొందారు.

ఇవి కూడా చదవండి:

అభిమానులు అడిగితే కాదనలేను: అల్లు అర్జున్

‘సుధీర్స్ జోకర్’లో డిటెక్టివ్ జీవన్‌ని చూశారా..

కనకరాజు 2 డేస్ కలెక్షన్స్.. ఊచకోత

Updated Date - Aug 09 , 2026 | 07:25 PM