కనకరాజు 2 డేస్ కలెక్షన్స్.. ఊచకోత
ABN , Publish Date - Aug 09 , 2026 | 03:36 PM
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఈ మూవీ రాబట్టిన రెండు రోజుల కలెక్షన్ల వివరాలను మేకర్స్ తెలిపారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej), రితికా నాయక్ (Ritika Nayak) జంటగా మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju). ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ హారర్ కామెడీ థ్రిల్లర్, మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది. సినిమా విడుదలకు ముందు వేసిన ప్రీమియర్స్‌తోనే సినిమా హిట్ టాక్‌ని సొంతం చేసుకున్న విషయం తెలియంది కాదు. కామెడీతో పాటు సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ఊహించని రేంజ్‌లో రెస్పాన్స్ లభిస్తోంది. తాజాగా ఈ మూవీ రెండు రోజలకు ఎంత రాబట్టిందో తెలుపుతూ మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ విడుదల చేశారు.
ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే భారీ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 23.6 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా విడుదల చేసిన పోస్టర్‌లో తెలిపారు. శనివారం, ఆదివారం సెలవు రోజులు కావడంతో థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. దీంతో వరుణ్ తేజ్ కెరీర్‌లోనే ఇది సాలిడ్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలుస్తోంది. ఆదివారం కూడా ఈ సినిమాకు భారీగా బుకింగ్స్ జరుగుతుండటంతో ఫస్ట్ వీకెండ్‌లో ఈ సినిమా లాభాల బాట పట్టే అవకాశం ఉందని ట్రేడ్ రిపోర్ట్స్ తెలుపుతున్నాయి.
యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ టైమింగ్, నటనతో పాటు కమెడియన్ సత్య కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. థమన్ సంగీతం సినిమాకి అదనపు బలంగా నిలిచింది. చూద్దాం మరి.. వీకెండ్ ముగిసే సమయానికి ఈ కలెక్షన్ల గ్రాఫ్ ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో..
ఇవి కూడా చదవండి:
Mahesh Babu: సూపర్‌స్టార్‌కు చిరు, పవన్, వెంకీ స్పెషల్ విషెస్
అందుకే చెత్త సినిమాల్లో నటించా: సీనియర్ నటి
‘స్పిరిట్’ అద్భుతంగా వస్తోంది - సందీప్ రెడ్డి వంగా