సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Raviteja: ‘తులాభారం’లో బూతులేంటి గురూ.. వివేక్‌ ఆత్రేయ మార్క్‌ మిస్‌ అయిందా?

ABN, Publish Date - Oct 11 , 2026 | 01:34 PM

‘మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికీ’, ‘సరిపోదా శనివారం’ వంటి చిత్రాలతో దర్శకుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు వివేక్‌ ఆత్రేయ.

‘మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికీ’, ‘సరిపోదా శనివారం’ వంటి చిత్రాలతో దర్శకుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు వివేక్‌ ఆత్రేయ. ఆయన ఇప్పటి వరకూ తీసిన ప్రతి సినిమా కొత్తతరహా కథతో తెరకెక్కినదే. మాటల్లో వినోదం, చిన్న చమత్కారం, హ్యూమర్‌ ఆయన రచనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇప్పుడు ఆయన్‌ రవితేజతో ‘తులాభారం’ చిత్రం చేస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ టైటిల్‌ గ్లింప్స్‌కు సంబంధించి ఓ డాక్యుమెంటరీ రిలీజ్‌ చేశారు. సరదాగా సాగిన ఈ వీడియో సినిమాపై మరింత ఆసక్తి పెంచేలా ఉంది. దీనిలో రవితేజ తనపైతాఆనే సెటైర్లు వేసుకున్నారు. అయితే ఈ నవ్వుల సన్నివేశాల్లో మధ్యలో కొన్ని బూతులు కూడా వినిపించాయి. రెండు, మూడు చోట్ల బీప్స్‌ కూడా వేశారు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది. ఎందుకంటే వివేక్‌ సినిమాలు చాలా క్లీన్‌గా ఉంటాయి. ఆయన సినిమాల్లో మాటలు, పాత్రల తీరును బట్టి కామెడీ పుట్టుకొస్తుంది.

క్వాలిటీ కామెడీ వివేక్‌ ప్రత్యేకత. ఇప్పుడు ‘తులాభారం’ గ్లింప్స్‌లో ఆయన మార్క్‌ కానీ కొత్త విధానం కనిపించడం కాస్త ఆశ్చర్యానికి గురి చేసే అంశమే! ఇక రవితేజ సినిమాల్లో మాస్‌ ఎలిమెంట్స్‌ ఎక్కువగా ఉంటాయి. అందులో బూతులు ఉండాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వివేక్‌లాంటి రచయిత నుంచి ప్రేక్షకులు ఈ తరహా కంటెంట్‌ ఆశించరు. క్లీన్‌ కంటెంట్‌నే కోరుకుంటారు. బూతులు లేకుండా హాస్యం పండించగల స్టామినా వివేక్‌కు ఉందని ప్రేక్షకుల అభిప్రాయం. అయితే ఇప్పుడు వచ్చింది చిన్న గ్లింప్స్‌ మాత్రమే కాబట్టి పెద్దగా సమస్య లేదు. పైగా రవితేజ ఇటీవల ‘ఇరుముడి’లాంటి హిట్‌తో ప్రేక్షకులను అలరించారు. దానిని దృష్టిలో పెట్టుకుని బూతులు లేకుండా చూసుకోవాలని వివేక్‌కు అభిమానులు సూచిస్తున్నారు.

Updated Date - Oct 11 , 2026 | 01:48 PM