సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Irumudi: 100 రోజులు పూర్తి.. థియేటర్లలో పాటలతో మరోసారి మ్యాజిక్!

ABN, Publish Date - Nov 28 , 2026 | 01:50 PM

కార్తీక మాసం సందర్భంగా మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్ర బృందం ప్రేక్షకులకు ప్రత్యేక కానుక అందిస్తోంది.

కార్తీక మాసం సందర్భంగా మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్ర బృందం ప్రేక్షకులకు ప్రత్యేక కానుక అందిస్తోంది. సినిమా విడుదలై 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. నవంబర్ 28న రాత్రి 10:23 గంటలకు మైత్రీ విమల్, మైత్రీ గంగ థియేటర్లలో ఈ స్పెషల్ షోలు జరగనున్నాయి.

ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా సినిమాలోని చార్ట్‌బస్టర్ పాటలు నిలవనున్నాయి. ఇప్పటికే సంగీత ప్రియులను అలరించిన ఈ పాటలను వెండితెరపై రెండుసార్లు ప్రదర్శించనున్నారు. థియేటర్లలో ఈ పాటలను మరోసారి ఆస్వాదించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా చిత్ర బృందం టికెట్ బుకింగ్స్‌ను కూడా ప్రారంభించింది. ఆసక్తి ఉన్న ప్రేక్షకులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ప్రియ భవానీ శంకర్, సాయికుమార్, బేబీ నక్షత్ర కీలక పాత్రల్లో నటించారు.

ALSO READ:
సాక్షి మాలిక్ బికినీ ఫొటోలు వైరల్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు కిక్కు!'

Nani: పరాజయాలతో నాని రూట్ మారిందా..?

Daddy Cool: 15 ఏళ్ల తర్వాత షారుఖ్‌ – కరీనా జోడీ.. ‘డాడీ కూల్‌’తో రచ్చ

Updated Date - Nov 28 , 2026 | 01:53 PM