సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'ఇరుముడి'.. సినిమాపై వివాదం! ఆ స‌న్నివేశాలు.. తొల‌గించాల‌ని డిమాండ్

ABN, Publish Date - Aug 25 , 2026 | 06:33 AM

థియేట‌ర్ల‌లో ఊహించ‌ని ప్ర‌జాధ‌ర‌ణ‌తో దూసుకుపోతున్న ఇరుముడి చిత్రానికి అనుకోని అవ‌రోధం ఎదురైంది.

irumudi

ర‌వితేజ (Ravi Teja) హీరోగా వ‌చ్చిన‌ ఇరుముడి (Irumudi) సినిమాలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిరాలు పాత్రను అత్యంత ప్రతికూలంగా చూపించారని ఏపీటీఎఫ్ (Andhra Pradesh Teachers Federation) ఆక్షేపించింది.

జడ్పీ ఉన్నత పాఠశాల-సీలేరు (Sileru) పేరుతో సినిమా చిత్రీకరించారని, అందులో ఉపాధ్యాయులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ మంజుల, కె.బసవలింగారావు సోమవారం ఓ ప్రకటనలో ఆరోపించారు.

సినిమాలో నెగిటివ్‌గా చూపించిన టీచ‌ర్ క్యారెక్ట‌ర్ వెనుక APలోని ప్రభుత్వ పాఠశాల కనిపిస్తోందని, విద్యార్థుల యూనిఫాం కూడా ప్రస్తుతం ప్రభుత్వ పాఠ‌శాల‌లో వాడుతున్నదేనని APTF పేర్కొంది.

ప్రభుత్వ పాఠశాలల టీచర్లను కించపరిచేలా, వారి గౌరవాన్ని తగ్గించేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని, టీచర్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ సన్నివేశాలను తొలగించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Updated Date - Aug 25 , 2026 | 07:36 AM