సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'ఇరుముడి' దెబ్బ‌.. ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాలను వెనక్కి నెట్టి రికార్డుల వేట

ABN, Publish Date - Aug 30 , 2026 | 09:52 PM

మాస్‌ రాజా రవితేజ, సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఇరుముడి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది.

Irumudi

మాస్‌ రాజా రవితేజ, సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన 'ఇరుముడిస‌ (Irumudi) బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. రవితేజ (Ravi Teja) కెరీర్‌లో ఎన్నడూ చూడని సరికొత్త కోణంలో తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. మాస్‌ రాజా కెరీర్‌లోనే అత్యంత వేగంగా వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం, కేవలం పది రోజుల్లోనే 150 కోట్ల మార్క్‌ను దాటి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. సరైన కథ పడితే మాస్ రాజా సృష్టించే సునామీ ఎలా ఉంటుందో 'ఇరుముడి' సినిమాతో పూనకాలు తెప్పిస్తున్నారు.

డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం, థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. భక్తి, హృదయాన్ని హత్తుకునే కూతురు సెంటిమెంట్ ప్రధానంగా సాగిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించగా.. బేబీ నక్షత్ర, స్వసికా విజయ్, సాయికుమార్ తమ అద్భుతమైన నటనతో కీలక పాత్రల్లో మెరిశారు. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం, ప్రాణం అంటే అది జి.వి. ప్రకాశ్ కుమార్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. ప్రతి సన్నివేశాన్ని తన సంగీతంతో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. ‘ధమాకా’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత మాస్ రాజాలకు మళ్లీ ఆ స్థాయిని మించిన కంబ్యాక్ హిట్ పడటంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

అసలు విషయానికి వస్తే.. సాధారణంగా ఏ సినిమా అయినా రెండో వారంలోకి అడుగుపెట్టగానే ఆక్యుపెన్సీ, వసూళ్లు తగ్గడం సహజం. కానీ ‘ఇరుముడి’ విషయంలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. రెండో వారంలోకి వచ్చే కొద్దీ ఈ సినిమాపై ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరుగుతుండటం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆన్‌లైన్ బుకింగ్స్ గ్రాఫ్ చూస్తుంటే సెకండ్ వీకెండ్‌లోనూ ఇరుముడి జోరు కొంచెం కూడా తగ్గలేదని స్పష్టమవుతోంది.

ఆగస్టు 21న విడుదలైన ఈ చిత్రం, ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రవితేజ కెరీర్‌లోనే హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. అంతటితో ఆగకుండా, రెండో శుక్రవారం ఏకంగా 11.5 కోట్ల కలెక్షన్లను రాబట్టి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప-2', ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'బాహుబలి-2' రెండో వారపు రికార్డులను సైతం తుడిచిపెట్టేసింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ 14.5 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, ‘ఇరుముడి’ 11.5 కోట్లతో ఆల్ టైమ్ సెకండ్ పొజిషన్‌ని కైవసం చేసుకుంది. ఈ రేంజ్ రెస్పాన్స్ చూస్తుంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారని అర్థమవుతోంది.

ఇక 'ఇరుముడి' ఇచ్చిన ఊపుతో మాస్ మహారాజ వరుస క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు. హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఓ గ్రాండ్ మూవీ తెరకెక్కుతోంది, దీనికి సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అంతేకాకుండా ఈ సినిమాలో యంగ్ హీరో శ్రీవిష్ణు కూడా కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికీ’, ‘సరిపోదా శనివారం’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు వివేక్ ఆత్రేయతో కూడా ఒక వైవిధ్యమైన ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమాలతో మాస్ మహారాజ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.

Updated Date - Aug 30 , 2026 | 10:06 PM