సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘ఇరుముడి’ మరో సంచలన రికార్డ్.. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్‌లోనే 55 లక్షలకు పైగా టికెట్ల విక్రయం

ABN, Publish Date - Aug 28 , 2026 | 12:39 PM

రవితేజ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది.

irumudi

మాస్ మహారాజా రవితేజ (raviteja) నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఇరుముడి’ (irumudi) బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. విడుదలైనప్పటి నుంచి వరుసగా రికార్డులు సృష్టిస్తున్న ఈ చిత్రం తాజాగా ఆన్‌లైన్ టికెట్ విక్రయాల్లో సరికొత్త మైలురాయిని చేరుకుంది.

ప్ర‌ముఖ టికెటింగ్ ప్లాట్‌ఫార్మ్‌లైన బుక్‌మైషో (BookMyShow), డిస్ట్రిక్ట్ (District) యాప్స్‌ ద్వారానే ‘ఇరుముడి’కి 55 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఒక ప్రాంతీయ చిత్రానికి ఈ స్థాయిలో టికెట్ సేల్స్ నమోదు కావడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

రవితేజ మాస్ అప్పీల్, ఎమోషనల్ డ్రామా, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుండటంతో థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ కొనసాగుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మాస్ ప్రేక్షకుల వరకు అన్ని వర్గాల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో సినిమా కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతోంది.

బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ఇరుముడి’ ఇప్పుడు టికెట్ విక్రయాల్లోనూ తన సత్తా చాటుతూ కొత్త రికార్డులను లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం చిత్రానికి ఉన్న జోరు చూస్తుంటే రాబోయే రోజుల్లో మరిన్ని మైలురాళ్లు అందుకోవడం ఖాయమనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Updated Date - Aug 28 , 2026 | 12:40 PM