సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ranbir Kapoor: సీతమ్మగా సాయి ప‌ల్ల‌విని తప్పితే.. మరొకరిని ఊహించుకోలేక పోతున్నా

ABN, Publish Date - Oct 20 , 2026 | 09:08 AM

కొన్ని కథలు చెప్పాల్సిన అవసరం లేదు. అవి మనతో పాటు నిలిచిపోతాయి. రామాయణం కూడా అలాంటిదే అని రణ్‌బీర్ కపూర్ అన్నారు.

Ranbir Kapoor

రామాయణ గాథను వెండితెరపై సరికొత్తగా ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది ‘రామాయణం’ (Ramayana Movie). రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా, రాకింగ్ స్టార్ యశ్ (Yash) రావణుడిగా, సాయి పల్లవి (Sai Pallavi) సీతగా కనిపించనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నితేష్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ.. జై శ్రీరామ్! అందరికీ నమస్కారం. కొన్ని కథలు చెప్పాల్సిన అవసరం లేదు. అవి మనతో పాటు నిలిచిపోతాయి. రామాయణం కూడా అలాంటిదే. రామాయణం ఒక అద్భుతమైన జర్నీ. గొప్ప తండ్రిగా ఎలా ఉండాలి, కొడుకుగా ఎలా ఉండాలి, భర్తగా ఎలా ఉండాలి, స్నేహితుడిగా ఎలా ఉండాలో మనందరికీ చెబుతుంది. మీరు ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక సినిమా చూసినట్టుగా ఉండదు. కచ్చితంగా ఏదో ఒక అద్భుతమైన అనుభూతిని పొందినట్టుగా ఉంటుంది. మనందరిలో మంచిని పంచే సినిమా ఇది.నమిత్ మల్హోత్రా అద్భుతమైన విజన్‌తో ఈ సినిమాను నిర్మించారు.

డైరెక్టర్ నితీష్ గారు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. నన్ను ఈ సినిమాలో భాగం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు. రకుల్ పెర్ఫార్మెన్స్ ఇందులో చాలా కొత్తగా ఉంటుంది. మీ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది.సాయి పల్లవితో ఈ సినిమా జర్నీ ఒక మెమొరబుల్ ఎక్స్‌పీరియన్స్. షూటింగ్ సెట్‌లో సాయి పల్లవిని చూసినప్పుడు నిజంగా సీతమ్మవారిని చూసినట్టుగా అనిపించింది. తనను తప్పితే ఈ క్యారెక్టర్‌లో మరొకరిని ఊహించుకోలేక పోతున్నాను. నాకు ఒక బ్రదర్ ఉంటే రవిలా వుండేవాడు. రాకింగ్ స్టార్ యశ్ మంచి ఫ్యామిలీ మెన్. ఆయన తన ఫ్యామిలీని, తన సిటీని అన్నింటినీ వదిలేసి ఈ ‘రామాయణ’ సినిమా కోసం వచ్చారు. ఆయనలాంటి హార్డ్ వర్కర్‌ను నేను ఎప్పుడూ చూడలేదు.

దిల్ రాజు గారు డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో వచ్చే సినిమాలకు ఆయన ఎంతగానో సపోర్ట్ చేస్తారు. భవిష్యత్తులో ఆయనతో కలిసి మరిన్ని ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులకు, నా అన్నదమ్ములందరికీ నన్ను యాక్సెప్ట్ చేసినందుకు ధన్యవాదాలు. తప్పకుండా మీ అందరికీ ఒక గొప్ప బిగ్ స్క్రీన్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నాం. అందరికీ థాంక్యూ సో మచ్. హైదరాబాద్‌కు రావడం నాకెప్పుడూ ప్రత్యేకమే. మీ ప్రేమ, అభిమానం నాకు చాలా విలువైనవి. అందరం థియేటర్‌లో కలుద్దాం. జై శ్రీరామ్!

Updated Date - Oct 20 , 2026 | 09:13 AM