SS Rajamoul: పరిగెత్తుకుంటూ వెళ్ళి.. సిటీ బస్సులు ఎక్కిన రోజులు మరచిపోలేను.
ABN , Publish Date - Sep 29 , 2026 | 08:03 AM
ఇక్కడే సినిమాలో ఏబీసీడీలు నేర్చుకున్నాను' అని ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) అన్నారు. ఆ
'నేను కోడంబాక్కం మీనాక్షి కాలేజీ బస్టాపులో పరిగెత్తుకుంటూ వెళ్ళి సిటీ బస్సులు ఎక్కిన రోజులు మరచిపోలేను. ఇక్కడి చాట్, ఇడ్లీ, దోశ, ఐస్క్రీమ్ లు అంటే ఎంతో ఇష్టం. ఇక్కడే సినిమాలో ఏబీసీడీలు నేర్చుకున్నాను' అని ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) అన్నారు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానరుపై శశాంక్ యేలేటి దర్శకత్వంలో ఎస్ఎస్ రాజ మౌళి సమర్పణలో ఎస్ఎస్ కార్తికేయ, శోభు యార్ల గడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ (Don't Trouble The Trouble). ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం. తమిళం, తెలుగు, మల యాళం భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల చెన్నైలో జరిగింది.
ఇందులో హీరో సూర్య (Suriya) ముఖ్య అతిథిగా, ఎస్ఎస్ రాజమౌళి దంపతులతో పాటు ఎస్ఎస్ కార్తికేయ, హీరో ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil), సారా పలేకర్, సౌరభ్, వేల్స్ ఫిలిమ్స్ అదినేత ఐసరి కె.గణేశ్, శక్తి ఫిలిమ్స్ అధినేత బి.శక్తివేల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, 'ఒక సారి ఒక గొప్ప ఆర్కిటెక్ట్ నాతో ఇలా అన్నారు. 'మీరు మీ గోరు మీద ఒక భవనం రూపు రేఖలను గీయగలిగితే అదే అత్యుత్తమ భవనం' అని. ఇది నా చిత్రాలకు కూడా వర్తిస్తుంది. రెండున్నర గంటల సినిమాను రెండు లేదా. మూడు లైన్లలో కథ చెప్పాలి. అదే ఉత్తమ చిత్రం.
ఈ సినిమా దర్శ కుడు శశాంత్‌కు ఇదే నేను చెప్పాను. ఈ సినిమా కథను దర్శ కుడు ఒకే ఒక్క వాక్యంలో చెప్పారు. 'ఒక దెయ్యాన్ని కిడ్నాప్ చేసిన మనిషి కథ ఇదే దర్శకుడు చెప్పిన వన్‌లైన్ స్టోరీ. ఆ ఒక్క వాక్యంలోనే అందులోని భావాలన్నీ నా మదిలో మెదిలాయి. అందుకే ఈ కథ చాలా బాగుంది. ఆ తర్వాత ఈ సినిమా పని మొదలైంది. ఈ సినిమా నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. 'వారణాసి' సినిమా అప్ డేట్ గురించి మాట్లాడితే ఈ సినిమా గురించి మరిచిపోతారన్నారు.