సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘హిట్ అండ్ రన్’ ఫస్ట్ లుక్.. పోలీస్ ఆఫీసర్‌గా బ్రహ్మాజీ కొడుకు!

ABN, Publish Date - May 29 , 2026 | 10:40 PM

బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ హీరోగా, నటాషా సింగ్ హీరోయిన్‌గా ‘హిట్ అండ్ రన్’ అనే చిత్రం రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని మేకర్స్ వదిలారు.

Hit and Run Movie First Look

క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లలో మంచి కంటెంట్ పడితే.. ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో తెలియంది కాదు. ప్రస్తుతం ప్రేక్షకులు డిఫరెంట్ కంటెంట్‌ను ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చే సినిమాలను బాగా ఇష్టపడుతున్నారు. ఇప్పుడలాంటి కంటెంట్‌తోనే బ్రహ్మాజీ (Brahmaji) తనయుడు సంజయ్ రావ్ (Sanjay Rao) హీరోగా, నటాషా సింగ్ హీరోయిన్‌గా ‘హిట్ అండ్ రన్’ (Hit and Run) అనే చిత్రం రాబోతోంది. శ్రీ ఉరుకుంద ఈరణ్ణ స్వామి సమర్పణలో సతీష్ రెడ్డి అల్లం ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్రియేషన్స్ బ్యానర్‌లపై సతీష్ రెడ్డి అల్లం, కె. శేఖర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. సాయి కృష్ణ సాగర్ దర్శకుడు. హీరో సంజయ్ రావ్ పుట్టినరోజు (HBD Sanjay Rao) సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ వదిలారు.


ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ మొత్తం పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయని మేకర్స్ తెలిపారు. ఇక సంజయ్ రావ్ పుట్టిన రోజు స్పెషల్‌గా రిలీజ్ చేసిన ‘హిట్ అండ్ రన్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌లో సంజయ్ రావ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. గాయాలు, రక్తంతో నిండిపోవడం చూస్తుంటే.. ఈ సినిమా మంచి ఇంట్రెస్టింగ్‌ సబ్జెక్ట్‌తో రూపుదిద్దుకుంటోందనేది అర్థమవుతోంది. ఈ పోస్టర్‌తో పాటు మరో స్టిల్ కూడా మేకర్స్ వదిలారు.


ఈ స్టిల్‌లో సంజయ్ రావ్.. పోలీస్ ఆఫీసర్‌గా గన్ గురి పెట్టి కనిపిస్తున్నారు. ఆయన చూస్తున్న విధానం చూస్తుంటే.. క్రిమినల్స్‌ని ఆయన బెదిరిస్తున్నట్లుగా అనిపిస్తోంది. పోస్టర్, స్టిల్‌తో మేకర్స్ హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే ‘హిట్ అండ్ రన్’ టీజర్‌ను విడుదల చేస్తామని, టీజర్ వచ్చిన తర్వాత ఈ మూవీపై అంచనాలు అమాంతం పెరుగుతాయని మేకర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రిన్స్ హెన్రీ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

మెకానికల్ ఇంజనీర్ అవుతానని.. నాన్నకి అబద్ధం చెప్పా: రామ్ చరణ్

అరుదైన పిక్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కండక్టర్’ ఐడీ కార్డ్!

NBK111: బాలయ్య గ్యాంగ్‌స్టర్ లుక్.. ముంబై అడ్డాగా వేట!

యూపీ‌లో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?

Updated Date - May 29 , 2026 | 10:40 PM