హెబ్బా పటేల్ హీరోయిన్‌గా చిత్రాలయ క్రియేషన్స్ కొత్త సినిమా
ABN, Publish Date - Mar 14 , 2026 | 02:58 PM
హెబ్బా పటేల్ కథానాయికగా చిత్రాలయ క్రియేషన్స్ బ్యానర్ పై ఓ సినిమా తెరకెక్కనుంది.
హెబ్బా పటేల్ (Hebah Patel) కథానాయికగా చిత్రాలయ క్రియేషన్స్ (Chitralaya Creations) బ్యానర్ పై ఓ సినిమా తెరకెక్కనుంది. శ్రీలక్ష్మీ. ఎం నిర్మాత. 'దర్జా’ సినిమా ఫేమ్ మ్యాక్ (సలీం మాలిక్) ఈ చిత్రానికి దర్శకుడు. ఎమోషన్, కామెడీ ఎంటర్టైన్మెంట్ జానర్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను భారీగా తెరకెక్కించనున్నట్లు మేకర్స్ తెలిపారు.
నిర్మాత మాట్లాడుతూ, 'దర్జా’ మూవీతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించారు మ్యాక్ (Mack saleem - సలీం మాలిక్). ఆడియెన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా, డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునే ఆయన ఈసారి మరింత కొత్త కాన్సెప్ట్‌తో రానున్నారు. భాష్యశ్రీ మాటలు, పాటల్ని అందించనున్నారు. ఎం. సమీర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా, విష్ణు పానికర్ కెమెరామెన్‌గా వ్యవహరించనున్నారు. ఇతర వివరాల్ని త్వరలోనే ప్రకటించనున్నాం' అని అన్నారు. ఈ సినిమాకు సమర్పణ : అర్జున్ ఆర్ట్స్.
ALSO READ: నీరా ఆర్య బయోపిక్‌లో కంగనా రనౌత్
Satuarday Tv Movies: మార్చి 15, ఆదివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
నిర్మాతగా మారిన బన్నీ మేనేజర్ శరత్ చంద్ర నాయుడు!