సమంత చిత్రానికి చెక్ పెట్టిన హర్షిత్ రెడ్డి!
ABN, Publish Date - May 25 , 2026 | 12:05 PM
సమంత నిర్మించిన 'శుభం' సినిమాలో హీరోగా నటించిన హర్షిత్ రెడ్డి తాజా చిత్రం 'దీవానా'. ఇది సమంత హీరోయిన్‌గా నటించి, నిర్మించిన 'మా ఇంటి బంగారం' రిలీజ్ డేట్ కే విడుదల కాబోతోంది.
'మెయిల్, కల్కి 2898 ఎ.డి.' వంటి చిత్రాల్లోనూ, 'తరగతి గది దాటి' వెబ్ సీరిస్‌లోనూ నటించి చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు యువ నటుడు హర్షిత్ రెడ్డి. అతను హీరోగా సమంత నిర్మించిన తొలి చిత్రం 'శుభం' మంచి విజయాన్ని అందించింది. దాంతో ఇప్పుడు హర్షిత్ రెడ్డి 'దీవానా' అనే మూవీలో సోలో హీరోగా నటిస్తున్నాడు. సేహ మణిమేగలై హీరోయిన్‌గా పరిచయం అవుతున్న 'దీవానా' మూవీని వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ప్రేమకథా చిత్రాన్ని శ్రీకాంత్ సంగిశెట్టి డైరెక్ట్ చేస్తున్నాడు. తన 'శుభం' చిత్రంలో నటించిన హర్షిత్ రెడ్డి సోలో హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో ఆ మధ్య స్టార్ హీరోయిన్ సమంత 'దీవానా'లోని పాటను కూడా విడుదల చేసి, ఈ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపింది. అయితే... ఇప్పుడీ 'దీవానా' సినిమానే సమంతకు ఎసరు పెట్టబోతోంది.
విషయం ఏమంటే.. పలుమార్లు వాయిదా పడిన తర్వాత సమంత తాను హీరోయిన్‌గా నటించి, నిర్మించిన 'మా ఇంటి బంగారం' మూవీని జూన్ 19న విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. సరిగ్గా ఇప్పుడు అదే తేదీకి హర్షిత్ రెడ్డి నటించిన 'దీవానా'ను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ సోమవారం తెలిపారు. అంటే సమంత 'శుభం' హీరో సినిమా... ఆమె చిత్రానికే పోటీ కాబోతోందన్నమాట. 'దీవానా' మూవీని నిర్మిస్తున్న శ్రీదేవి, వాసుదేవ్ ఇద్దరూ గీతా ఆర్ట్స్ క్యాంప్‌కు చెందిన వాళ్ళు. వాళ్ళే ఈ సినిమాను పంపిణీ చేస్తున్నారు. సో... ఈ మూవీ ప్రమోషన్స్ గట్టిగానే చేస్తారనడంలో సందేహం లేదు. పైగా ఈ సినిమా నిర్మాతలకు దర్శకురాలు నందినీరెడ్డి మేకింగ్‌లో దన్నుగా నిలిచారు. ఇటు చూస్తే... నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన 'మా ఇంటి బంగారం'తోనే వీరు పోటీ పడుతున్నారు. మరి జూన్ 19న రాబోతున్న 'మా ఇంటి బంగారం, దీవానా' మధ్య ఎలాంటి పోటీ నెలకొంటుంది? ఎవరిది పై చేయి అవుతుందనేది? దీనిపై సమంత, నందినీరెడ్డి ఎలా స్పందిస్తారు? అనేది వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి:
జస్‌ప్రీత్ బుమ్రాకు సారీ చెప్పిన రామ్‌చరణ్.. అసలు విషయమిదే!
అల్లు అయాన్‌కు ఆర్‌సీబీ ప్లేయర్ స్పెషల్ గిఫ్ట్.. బన్నీ పోస్ట్ వైరల్!
40 ఏళ్ల తర్వాత సీక్వెల్‌కు ప్లాన్.. ఈ మూవీ వివరాలు తెలిస్తే షాకే!
MEGA158: ‘దట్స్ ఇట్.. ద బ్లడీ బెంచ్ మార్క్’.. టైటిల్ లీక్ చేసేస్తా!