'హ్యాపీ జర్నీ' నుంచి 'సీతాకోకలా...' సాంగ్ రిలీజ్
ABN , Publish Date - Aug 05 , 2026 | 03:57 PM
ఏడుగురు మహిళల విదేశీ ప్రయాణం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా 'హ్యాపీ జర్నీ'. అభిరామ్ నాయుడు దర్శకత్వం వహించిన ఈ సినిమానుంచి తాజాగా ఓ పాట విడుదలైంది.
రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, మహిళల భావోద్వేగాలను ప్రధానంగా తీసుకుని రూపొందుతున్న చిత్రం 'హ్యాపీ జర్నీ'. ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివ తేజ పైల కీలక సహాయ పాత్రలను పోషించారు. బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్న 'హ్యాపీ జర్నీ' చిత్రంతో అభిరామ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతుండగా, తరుణ్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ సింగిల్, టీజర్‌తో భారీ అంచనాలను రేకెత్తించిన చిత్ర బృందం, ఇప్పుడు 'సీతాకోకలా...' అనే సాంగ్ విడుదల చేసింది. శేఖర్ చంద్ర అందించిన స్వరాలు హార్ట్ టచ్చింగ్ వున్నాయి. సురేష్ బానిసెట్టి రాసిన సాహిత్యం మీనింగ్ ఫుల్ గా వుంది. చిన్మయి శ్రీపాద ఈ పాటను గానం చేశారు.
'మహిళలందరికీ తమకు ఎటువంటి బౌండరీలు లేవని గుర్తుచేసే ఈ పాట విన్నవెంటనే కనెక్ట్ అవుతుంద'ని మేకర్స్ చెబుతున్నారు. 'పారిస్, మాంట్‌పెలియర్, ఇతర అందమైన యూరప్ ప్రాంతాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా, అద్భుతమైన విజువల్స్‌తో పాటు హృదయానికి దగ్గరైన భావోద్వేగాలను కూడా అందించబోతోంద'ని తెలిపారు. కథ విదేశీ నేపథ్యంలో సాగినా, అందులోని మనుషుల అనుబంధాలు, భావాలు ప్రతి ఒక్కరికీ దగ్గరగా అనిపించేలా ఉంటాయ'ని అన్నారు. సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.
ఇవి కూడా చదవండి:
తండ్రి పాత్రకు పొట్ట బాగా ఉండాలన్నారు.. ఏం చేసేవాడినంటే: త్రినాథరావు నక్కిన
గ్లామర్ డోస్ పెంచితే ఆఫర్స్ వచ్చేస్తాయా రాశీ..
ఓరి మీ దుంప తెగ.. స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ ఇలా ఉన్నారేంట్రా!