ఓరి మీ దుంప తెగ.. స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ ఇలా ఉన్నారేంట్రా!
ABN , Publish Date - Aug 05 , 2026 | 12:22 PM
ఇటీవల థియేటర్లకు వచ్చిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే చిత్రం భారత దేశంలోనూ సంచలనాలు క్రియేట్ చేస్తోంది. అంచనాలను మించి కలెక్షన్లు రాబడుతోంది.
ఇటీవల థియేటర్లకు వచ్చిన స్పైడర్ మ్యాన్ (Spider Man) చిత్రం భారత దేశంలోనూ సంచలనాలు క్రియేట్ చేస్తోంది. అంచనాలకు మించి కలెక్షన్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఫ్యాన్స్ తమదైన శైలిలో ఈ సినిమాను ఓన్ చేసుకునిసెలబ్రేట్ చేస్తున్నారు. స్పైడర్ మ్యాన్ స్టార్స్ టామ్ హాలెండ్ (Tom holland), జెండయా (Zendaya), సాడీ సింక్‌లకు సంబంధించిన ఫొటోలను ఏఐ ఉపయోగించి తెలుగు పాపులర్ సినిమా పాటలకు, సన్నివేశాలకు లింక్ చేస్తూ ప్రత్యేక వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ‘పెద్ది’ సినిమాలోని పాట పోస్టర్‌ను ఈ ముగ్గురితో కలిసి రీ క్రియేట్ చేయగా నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. వాటిని చూసిన వారంతా.. ‘ఎంతకు తెగించార్రా.. మీ క్రియేటివిటీ తగలెయ్యా’ అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా తమిళ ఫ్యాన్స్ ఓ అడుగు ముందుకేసి క్రియేట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా ‘మీ దుంప తెగ.. ఇలా ఉన్నారేంట్రా మీరంతా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోలో.. సినిమాలో, రియల్ లైఫ్‌లోనూ లవర్స్ అయిన టామ్ హాలెండ్, జెండయా జంటకు తమిళ సాంప్రదాయ పద్దతిలో పెళ్లి చేయడమే గాక.. ఆ పెళ్లికి మార్వెల్ సూపర్ హీరోస్, అవెంజర్స్ హజరవడం, దగ్గరుండి పెళ్లి పనులు, వంట పనులు చేయడం వంటివి నవ్వులు పూయించేదిగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. మీరూ దీనిపై ఓ లుక్ వేయండి.