సినిమా షూటింగ్ అయిపోయిందని, హన్సిక ఏడ్చిన ఏకైక సినిమా ఏదో తెలుసా?

ABN , Publish Date - Apr 17 , 2026 | 10:10 PM

ఒక సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత, లాస్ట్ డే యూనిట్ మొత్తంలో ఒక ఎమోషన్ ఉంటుంది. దాదాపు సంవత్సరం పాటు అంతా కలిసి ఒక సినిమాకు పనిచేసి, అలా విడిపోతున్నప్పుడు ఎవరికైనా ఎమోషనల్ మూమెంటే అది.

Hansika

ఒక సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత, లాస్ట్ డే యూనిట్ మొత్తంలో ఒక ఎమోషన్ ఉంటుంది. దాదాపు సంవత్సరం పాటు అంతా కలిసి ఒక సినిమాకు పనిచేసి, అలా విడిపోతున్నప్పుడు ఎవరికైనా ఎమోషనల్ మూమెంటే అది. టెన్త్ క్లాస్ లాస్ట్ డే రోజు విద్యార్థులు ఎలా అయితే వెళ్లలేక వెళతారో.. అలానే సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత కొందరిలో అలాంటి ఎమోషనే నిండిపోతుంది. అయితే ఎన్ని సినిమాలు చేసినా, అలా ఒకే ఒక్క సినిమాకు ఎమోషనల్ అయ్యానని చెబుతోంది బబ్లీ బ్యూటీ హన్సిక (Hansika). ఈ పేరు అందరికీ పరిచయమే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్లిన ఈ భామ, ఇప్పటికీ లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొనారు. ఈ ఇంటర్వ్యూలో.. తన కెరీర్‌లో షూటింగ్ పూర్తైన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న ఒకే ఒక్క సినిమా గురించి చెప్పుకొచ్చారు. ఆ సినిమా ఏదో కాదు.. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేశముదురు’ (Desamuduru) చిత్రం. అవును, ఈ విషయం స్వయంగా హన్సికనే ఈ ఇంటర్వ్యూలో చెప్పారు.


ముందుగా అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ.. ‘‘అల్లు అర్జున్‌ ఒక అద్భుతమైన వ్యక్తి. చాలా మర్యాద ఇస్తారు. ‘దేశముదురు’ షూటింగ్ సమయంలో నేను చాలా చిన్న వయసు అమ్మాయినని తెలుసుకుని, ఒక మంచి స్నేహితుడిలా ఉంటూ, చాలా కంఫర్టబుల్‌గా ఉంచేవారు. షూటింగ్ సమయంలో ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్లం. నాకు సినిమా షూటింగ్స్‌లో ఇలా ఉంటుంది, అలా ఉంటుందని.. ఆయనే చాలా విషయాలు చెప్పారు. ఆ సినిమా టైమ్‌లోనే నేను కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను’’ అని హన్సిక తెలిపారు.


‘దేశముదురు’ సినిమా గురించి చెబుతూ.. ‘‘సినిమా షూటింగ్ మనాలీలో జరిగింది. అక్కడ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఆయన భార్య, మా మదర్, అల్లు అర్జున్ అందరం కలిసి భోజనం వండుకునేవాళ్లం. ఆ సెట్ ఒక కుటుంబంలా ఉండేది. షూటింగ్ పూర్తయ్యాక క్రూ మొత్తానికి వీడ్కోలు చెబుతుంటే, కన్నీళ్లు ఆగలేదు. నా కెరీర్‌లో ఒక సినిమా షూటింగ్ అయిపోయాక.. ఏడ్చిన ఏకైక సినిమా అదే. అప్పుడు ముంబైలోని ఒక బంగ్లాలో నివసిస్తుండే వాళ్లం. ‘దేశముదురు’ చేస్తున్న సమయంలోనే బాలీవుడ్ నుంచి ఓ అవకాశం కూడా వచ్చింది’’ అని హన్సిక గుర్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

విష్ణుప్రియ దారిలోనే మరికొందరు.. ఆ కంటెంట్ కావాలంటే సబ్‌స్క్రైబ్ అవ్వాల్సిందే.

మంగ్లీ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్.. అసలు కథ ఇప్పుడే మొదలైంది!

Balakrishna: ‘రూటు’ మార్చిన బాలయ్య.. కొడుకు కథను పక్కన పెట్టి.. తనే ఆ దర్శకుడితో?

Updated Date - Apr 17 , 2026 | 10:10 PM