Gossip: రాశీ సింగ్ మూవీ నుంచి తొలి గీతం!
ABN, Publish Date - Jun 18 , 2026 | 12:56 PM
రాశీ సింగ్ హీరోయిన్‌గా వైభవ్ కౌండిన్య తెరకెక్కిస్తున్న సినిమా 'గాసిప్'. ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ విడుదలైంది.
యంగ్ బ్యూటీ రాశీ సింగ్ టాలీవుడ్‌లో తన సత్తా చాటుతోంది. ఆమె నటించిన తాజా చిత్రం 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' శుక్రవారం విడుదల కాబోతోంది. దానికి ఒకరోజు ముందు గురువారం రాశీ సింగ్ (Rashi Singh) లేటెస్ట్ మూవీ 'గాసిప్' నుంచి పబ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. 'గాసిప్' (Gossip) మూవీని వైభవ్ కౌండిన్య (Vaibhav Koundinya) దర్శకత్వంలో యతి నిర్మిస్తున్నారు. 'సిప్పు సిప్పు...' అంటూ సాగే ఈ ఎనర్జిటిక్ పబ్ డాన్స్ ట్రాక్‌కు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, శక్తికాంత్ కార్తీక్ స్వరాలు సమకూర్చారు. ఈ పాటను మాళవిక పాడింది.
గతంలో రూమర్స్ ను స్ప్రెడ్ చేయడానికి ఆకాశరామన్న ఉత్తరాలు, గోడమీద రాతలు రాసేవాళ్లని, ఇప్పుడు పుకార్లకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారంటూ సెటైరిక్‌గా ఈ పాట సాగింది. మిడిల్ క్లాస్ అమ్మాయి జీవితం చుట్టూ తిరిగే 'గాసిప్' సినిమా యూత్‌కు మాత్రమే కాకుండా కుటుంబ ప్రేక్షకులకూ నచ్చేలా తీర్చిదిద్దుతున్నామని మేకర్స్ చెబుతున్నారు. తాజాగా విడుదలైన 'సిప్పు.. సిప్పు...' గీతానికి సునీల్ సున్నపు మాస్టర్, ఫల్గుణి బంగెర కొరియోగ్రఫీ సమకూర్చారు.
ఇవి కూడా చదవండి:
Jana Nayagan: సీఎం అయినా విడుదల కాని సినిమా.. ఈసారి రెండు డేట్స్!
సోలో హీరోగా 400 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్.. ఆడు ‘పెద్ది’ సారొ!
‘బెంగళూరు నాగరత్తమ్మ’.. సింగీతం ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌ను తెరపైకి తెచ్చేదెవరో..