బాలయ్య కోసం గోపీచంద్ మలినేని ప్రత్యేక హోమం..
ABN , Publish Date - Jul 26 , 2026 | 06:03 PM
'ఎన్‌బీకే 111' (NBK 111) సినిమా షూటింగ్ లో నందమూరి బాలకృష్ణ గాయపడిన విషయం తెలిసిందే. ఇటీవల హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది.
'ఎన్‌బీకే 111' (NBK 111) సినిమా షూటింగ్ లో నందమూరి బాలకృష్ణ గాయపడిన విషయం తెలిసిందే. ఇటీవల హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించగా, కొద్ది వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. బాలయ్య త్వరగా కోలుకోవాలని అభిమానులు, శ్రేయోభిలాషులు రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా బాలకృష్ణ ఆరోగ్యం కోసం ప్రత్యేక హోమం నిర్వహించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బెంగళూరులోని కంబాలిపుర, హాస్కోటేలో ఉన్న కాటేరమ్మ దేవాలయంలో 18 మంది వేద పండితులతో దర్శకుడు గోపిచంద్ మలినేని హోమం నిర్వహించారట. బాలకృష్ణ పూర్తి ఆరోగ్యంతో తిరిగి షూటింగ్‌లో పాల్గొనాలని, సినిమా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవ్వాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలుస్తోంది.
గతంలో 'వీర సింహారెడ్డి' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ఇప్పుడు 'ఎన్‌బీకే 111' తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే బాలకృష్ణ గాయపడటంతో షూటింగ్‌కు తాత్కాలికంగా విరామం పడింది. దీనివల్ల సినిమా షూటింగ్స్‌తో పాటు, నియోజకవర్గంకు, అభిమానులకు దూరంగా బాలయ్య ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదంతా కూడా దర్శకుడు గోపీచంద్ మలినేని కారణంగా అంటూ కొందరు అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణతో రిస్కీ సన్నివేశాలను చేయించిన కారణంగానే ఈ రోజు ఇలాంటి పరిస్థితి నెలకొందని ఆ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు. త్వరలోనే బాలకృష్ణను ఏఐజీ ఆసుపత్రి డాక్టర్లు డిశ్చార్జ్ చేయబోతున్నారు అంటూ అభిమానులకు సమాచారం అందింది. దాంతో అభిమానులు ఊరిపి పీల్చుకుంటున్నారు.
భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న 'ఎన్‌బీకే 111' చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనే ప్రణాళికలో చిత్రబృందం ఉంది. అయితే బాలకృష్ణకు గాయం కావడంతో షూటింగ్‌కు తాత్కాలిక విరామం పడింది. గతంలో 'వీర సింహారెడ్డి'తో బ్లాక్‌బస్టర్ అందించిన బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ మళ్లీ కలిసి వస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం బాలయ్య ఆరోగ్య పరిస్థితిని బట్టి షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆయన త్వరగా కోలుకుంటే ఈ ఏడాదిలోనే సినిమా విడుదలయ్యే అవకాశాలు లేకపోలేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ:
కొరియన్ ఫుడ్‌తో ఇబ్బందిపడ్డ వరుణ్ తేజ్.. నవ్వులు పూయిస్తున్న వీడియో
త్వరలో రజనీకాంత్ బయోపిక్..
NBK: ఏఐజీ ఆస్పత్రిలో బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు