కొరియన్ ఫుడ్‌తో ఇబ్బందిపడ్డ వరుణ్ తేజ్.. నవ్వులు పూయిస్తున్న వీడియో

ABN , Publish Date - Jul 26 , 2026 | 03:49 PM

వరుణ్ తేజ్ , రితిక నాయక్ జంటగా నటిస్తున్న ‘కొరియన్ కనకరాజు’  సినిమాకు సంబంధించి ఈ వీడియో వైరల్ అవుతోంది. దీనిని మీరు చూసేయండి. 

వరుణ్ తేజ్ హీరో (Varun Tej)గా నటించిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju). రితిక నాయక్ కథానాయిక.  మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు.  ఆగస్టు 7న సినిమా  విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా మేకర్స్ ఓ సరదా వీడియోను విడుదల చేశారు. వరుణ్ తేజ్, రితికా నాయక్‌, సత్య సరదాగా కొరియన్‌ రెస్టరంట్‌లో తినడానికి చేయడానికి వెళ్తారు. అక్కడి వంటకాలు వారికి వింతగా అనిపిస్తాయి.  తిండడానికి ఇబ్బంది పడతారు. ఆ తర్వాత నీరసంగా  అక్కడి నుంచి   వెళ్లిపోతారు. ఈ మొత్తం సిట్యుయేషన్ ని  వీడియోగా తీసి పోస్ట్ చేశారు. ఇందులో వారి ఎక్సప్రెషన్స్, 'రకరకాలుగా ఉంది మాస్టారు' అనే డైలాగులు నవ్వులు పూయిస్తున్నాయి. . 

Updated Date - Jul 26 , 2026 | 03:51 PM